విజయనగరం, మే 19,
ప్రార్ధించే పెదవుల కన్నా...సహాయం చేసే చేతులు మిన్న అన్న నానుడి విజయనగరం ఫెస్ బుక్ యూత్ అడ్మిన్స్ సొంతం చేసుకుంటున్నారు.కోవిడ్ విపత్కర సమయంలో మేము సైతం అంటూ ఫేస్ బుక్ సందేశంతో ఆపన్న హస్తం అందిస్తున్నారు.దీంతో వివిధ ఆసుపత్రుల్లో కోవిడ్ తో మృతి చెందిన వారి బంధువులు సమాచారంతో కోవిడ్ డెడ్ బాడీలను స్మశాన వాటికలకు తరలించి దగ్గరుండి అంత్యక్రియలు జరిపిస్తూ....తమ ఔదార్యాన్ని చాటుకుంటూ...పదిమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
సార్...మా బంధువులు చనిపోయారు హాస్పిటల్ లో సిబ్బంది ఎవరూ మృత దేహాన్ని శ్మశానానికి తీసుకుని వెళ్లడానికి ఎవరూ రావడం లేదు.మాకేమైనా సహాయం చేయగలరా...? ప్లీజ్...ప్లీజ్...అంటూ విజయనగరం యూత్ సబ్యులకు ఫోన్...మీరెవరు..!అది ఏ ఆసుపత్రి అంటూ బాధితులకు ధైర్యం చెప్తూ....అసోసియేషన్ సభ్యులు వెంటనే వచ్చి ఆ శవాన్ని అంబులెన్స్ లో శ్మశానానికి తీసుకెళ్లి హిందు సాంప్రదాయం ప్రకారం అంత్యక్రియలను నిర్వహించడం వారి రోజువారీ అలవాటుగా మారింది.ప్రస్తుత పరిస్థితుల్లో సహాయం చేసే మనుషులున్నా,సాయం చేయాలనే మనసున్నా కరోనాకి భయపడి అయినవాళ్లు కూడా కోవిడ్ బాధితుల దగ్గరకు రాలేకపోతున్నారు.ఐతే కోవిడ్ రోగులతో పాటు కోవిడ్ తో మృతిచెందిన వారిని,ఆర్థిక స్తోమత లేని వారు,అనాధ మృతదేహాలను తమ సొంత ఖర్చులతో స్మశాన వాటికకు తరలించి అంత్యక్రియలు నిర్వహించి ప్రస్తుతం కోవిడ్ వారియర్స్ గా అందరి దగ్గర మన్ననలు పొంది పదిమందికి ఆదర్శంగా నిలుస్తుండటం విశేషం.విజయనగరం జిల్లా డెంకాడ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తున్న షేక్ ఇళ్తామస్ మరొకరు శివ.శివకు ఓ సొంత అంబులెన్స్ ఉండటంతో కోవిడ్ రోగులతో పాటు డెడ్ బాడీలను తరలించడానికి వారి వద్ద నుంచి పైసా డబ్బులు ఆశించకుండా ఉచితంగా సేవాలందించడం ప్రస్తుత పరిస్థితుల్లో చాలా గొప్ప విషయం.వీరిద్దరితో పాటుగా మరికొంత మంది సభ్యులు కలసి విజయనగరం ఫేస్ బుక్ గ్రూప్ ను క్రియేట్ చేసి కష్టాల్లో ఉన్న వారికి అండగా నిలుస్తూ వస్తున్నారు.ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో వారికి ఆపన్న హస్తం అందించటంలో ముందుంటున్నారు.పది మందికి సేవ చేయాలనే తపన ప్రస్తుతం కరోనాతో మృతి చెందిన వారిపట్ల ఈ విజయనగరం యూత్ సభ్యుల సేవా గుణం కోవిడ్ బాధితుల కుటుంబాలకు కొండంత అండగా నిలుస్తోంది.వారికి కావలసిన మందులు,ఆహారం,ఆసుపత్రి అవసరాలు, అంత్యక్రియలు ఇలా దేనికీ,కుటుంబ సభ్యులు కూడా ముందుకు రాకపోయినా మేమున్నామంటూ వారిని అక్కున చేర్చుకొని వారి కష్టాలను అర్ధం చేసుకుని కోవిడ్ బాధితుల బంధువులకు అండగా నిలుస్తున్నారు.ఐతే తెలుగు రాష్ట్రాలలోని పలు స్వచ్ఛంధ సంస్థలు కరోనా రోగులకు, మృతులకు సేవలు అందిస్తున్నాయి.కానీ ఇళ్తామస్,మరికొంతమంది స్నేహితులు రూపాయి డబ్బులు ఆశించ కుండా తమ సొంత కార్చులతో కోవిడ్ డెడ్ బాడీలను అంబులెన్స్ తో తరలించి అంత్యక్రియలు తామే స్వయంగా నిర్వహించడంతో కోవిడ్ బాధిత కుటుంబాలు విజయనగరం యూత్ సేవ పట్ల రుణపడి ఉంటామని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఐతే ముస్లిం కుటుంబానికి చెందిన షేక్ ఇళ్తామస్ మొదట ముస్లిం కుటుంబాల్లో కోవిడ్ బాధితుల కోసం మాత్రమే కోవిడ్-19 జేఏసీ ఏర్పాటు చేశారు.ఐతే హాస్పిటల్స్ దగ్గరకు వెళ్లినప్పుడు అన్నీ మతాల వాళ్లూ బాధలు పడుతున్నారనే విషయం గమనించి మతం కంటే,మానవత్వమే ముఖ్యమని భావించిన యూత్ కులమతాలకు అతీతంగా అందరికీ సాయం చేయడం ప్రారంభించాలనే సదుద్దేశంతో సొంతంగా అంబులెన్స్ ద్వారా కోవిడ్ తో మృతి చెందిన డెడ్ బాడీలను తమ అంబులెన్సులో మృతదేహాన్ని ఉచితంగా తరలించడంతోపాటూ,వారి మత సాంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించి కోవిడ్ బాధితులకు కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు