YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

వినిపించని కుయ్...కుయ్... కుయ్

వినిపించని కుయ్...కుయ్... కుయ్

నెల్లూరు, మే 19, 
జగన్ గత ఏడాది కరోనా టైమ్ లో విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద జెండా ఊపి ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన 104 వాహనాలు ఏపీకే గర్వకారణం అని జాతీయ మీడియా కూడా రాసింది. వైద్య పరంగా ఇవి ఎంతో కీలకమైన పాత్ర పోషించేలా రూపొందించారు. ఒక్క ఫోన్ కాల్ రోగి ఇంటి నుంచి వెళ్తే క్షణాలలో ఠక్కున వాలిపోయి వారికి ఆసుపత్రికి చేర్చే పవిత్రమైన బృహత్తరమైన బాధ్యతను 104 వాహనాలు నిర్వహిస్తున్నాయి. ఇది నాటి సీఎం వైఎస్సార్ మానస పుత్రిక అయితే జగన్ దాన్ని మరింత విస్తృతం చేసి వేయికి పైగా వాహనాలను ఏపీ నిండా అన్ని జిల్లాల్లో ఉండేలా చేశారు.ఇదిలా ఉంటే కరోనా సెకండ్ వేవ్ మొదలైనప్పటి నుంచి 104 వాహనాలకు ఎంతో డిమాండ్ వచ్చిపడింది. అయితే ఈ వాహనాల పనితీరుని ఎవరు మానిటరింగ్ చేస్తున్నారో తెలియదు. పైగా ఫోన్లు ప్రాణాపాయంలో ఉన్న బాధితుడి ఇంటి నుంచి వెళ్తే రెస్పాన్స్ లేదని కూడా చెబుతున్నారు. ఇది ఇప్పటి సమస్య కూడా కాదు, గత ఏడాది మొదటి దశ కరోనా వేళ కూడా ఇలాగే జరిగింది. ఇపుడు అంతకు మించి కేసులు వస్తున్న వేళ కుయ్ కుయ్ సౌండే లేకుండా పోతోంది అన్న విమర్శలు అయితే ఉన్నాయి. వాటిని చెక్ చేసుకోవడానికి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విశాఖలో ఒక చోట నుంచి స్వయంగా ఫోన్ చేస్తే ఆయనకే షాక్ తగిలింది. రెస్పాన్స్ కూడా ఆయన కాల్ కి రాలేదంటే వాటి నిర్వాకం ఎలాగా ఉందో అర్ధం చేసుకోవాల్సిందే.ఇక్కడ వచ్చిన చిక్కు ఏంటి అంటే జగన్ ప్రతీ సంక్షేమ పధకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభిస్తున్నారు. ఆయన వాటికి ఎంతో ప్రాధాన్యత కూడా ఇచ్చి నిధులు కూడా కేటాయిస్తున్నారు. అయితే ఒక్కసారి సీఎం చేతుల నుంచి కనుక అవి మారితే ఇక వాటి పనితీరులో తేడా వచ్చేస్తోంది అన్న విమర్శలు ఉన్నాయి. వందల కోట్లు వీటి కోసం ఖర్చు చేస్తున్నా కూడా సరైన సమయంలో ప్రజలకు ఉపయోగపడకపోతే వాటికి విలువ ఏముంటుంది. పైగా ప్రభుత్వానికి చెడ్డ పేరు కూడా వస్తోంది. సరిగ్గా ఈ విషయం మీదనే విజయసాయిరెడ్డి కూడా విసుక్కోవడం కనిపించింది. ఆయన సైతం ఇలా అయితే ఎలా అన్నట్లుగా వార్తలు వచ్చాయి.వైఎస్ ఆర్ టైమ్ లో ఇన్ని వాహనాలు లేవు, ఇంత హంగామా కూడా లేదు. కానీ వాటి పని తీరు ఘనంగా ఉండేది అని జనాలు ఇప్పటికీ చెప్పుకుంటారు. నాడు 23 జిల్లాల ఉమ్మడి ఏపీలో 104 సేవలు అమోఘం అని ఇప్పటికి అంటారు. వైఎస్సార్ సైతం కుయ్ కుయ్ అని తన ప్రచారంలో చెబుతూ జనాలకు వాటి సేవలు గుర్తు చేసేవారు. ఒక విధంగా వైఎస్సార్ పాలనకు అంబాసిడార్ గా మారిన 104 సేవలు ఇపుడు విమర్శల పాలు కావడం అంటే ఆలోచించాలి. తన తండ్రి చేసిన కార్యక్రమాలు మరో రెండు అడుగులు వేసి ఇంకా గొప్పగా చేస్తాను అని జగన్ చెబుతున్నారు. ఆయన చిత్తశుద్ధిని కూడా కాదనలేకపోయినా కూడా ఇక్కడ అమలులోనే తేడా వస్తోంది. వైఎస్సార్ మానస పుత్రికను కాపాడుకోవడంతో విఫలం అయితే ఎన్ని రకాల పధకాలు అమలు చేసినా కూడా వాటికి రాణింపు ఉండదు అన్నది జనం మాట.

Related Posts