హైదరాబాద్
గడ్డి అన్నారం పండ్ల మార్కెట్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. మార్కెటింగ్ శాఖ నిబంధనలకు విరుద్ధంగా పండ్లను మగ్గ పెట్టేందుకు నిషేధిత రసాయనాలను వినియోగిస్తున్నారనే సమాచారం మేరకు ఫుడ్ సేఫ్టీ అధికారులు లక్ష్మీ నారాయణ రెడ్డి, ఆధ్వర్యంలో మార్కెట్ లోని దుకాణాల లో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా మామిడి పండ్లను మగ్గ పెట్టేందుకు నిబంధనలకు విరుద్ధంగా ఇథలిన్ పౌడర్ వినియోగిస్తున్నట్టు గుర్తించారు. మోతాదుకు మించి ప్యాకెట్లను వినియోగిస్తున్న 15 మందికి కమిషన్ ఏజెంట్లకు అధికారులు జరిమానాలు విధించారు. అనంతరం కమీషన్ ఏజెంట్లు, వర్తకులు గడ్డి అన్నారం మార్కెట్ ఉన్నత శ్రేణి అధికారి ప్రవీణ్ రెడ్డి తో కలిసి అవగాహన కార్యక్రమం నిర్వహించారు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నిషేధిత రసాయనలు వాడితే కమీషన్ ఏజెంట్లు లైసెన్స్ ను రద్దు చేసి కేసలు నమోదు చేస్తామని అధికారులు హెచ్చరించారు. ప్రభుత్వ అనుమతి పొందిన ఎన్- రైప్ వంటి రసాయనాలను మాత్రమే వినియోగించాలని వ్యాపారులకు సూచించారు.