YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

విశాఖ కాంగ్రెస్ కు షాక్ వైకాపాలో చేరని రమణకుమారి

విశాఖ కాంగ్రెస్ కు షాక్ వైకాపాలో చేరని రమణకుమారి

విశాఖపట్నం
కాంగ్రెస్  పార్టీకి విశాఖ లో పెద్ద దెబ్బ తగిలింది. కాంగ్రెస్ లో రాష్ట్ర మహిళ అధ్యక్షురాలుగా ఉన్న రమణి కుమారి పార్టీ రాజీనామా చేసారు. ఎంపీ విజయసాయిరెడ్డి సమక్షంలో వైసీపీ లో చేరారు.  ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాస్, నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్, ఇతర పార్టీ నేతలు, రమణికుమారిని వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రమణికుమారి మాట్లాడుతూ వైసీపీ లో చేరటం చాలా ఆనందంగా ఉంది. సీఎం జగన్ మహిళలకు ఇస్తున్న ప్రాధాన్యతను చూసి ఈ రోజు నేను వైసీపీ పార్టీలో జాయిన్ అయ్యాను. విశాఖ ను ఒక రాజధాని చేయడం ఆయన పాలనకు ఒక ఉదాహరణ. విశాఖ రాజధాని అవ్వడం వలన ముఖ్యంగా నిరుద్యోగ యువతకు ఉద్యోగలు వస్తాయి. భవిషత్ లో పార్టీ పట్టిస్తాటకి నేను కృషి చేస్తానని అన్నారు.
పర్యాటకశాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ గతంలో రమణికుమారి,  నేను కాంగ్రెస్ పార్టీ లో కలిని పని చేసాము.  సీఎం జగన్ పాలన చూసి రమణి కుమారి వైసీపీ లో చేరారు. గత ప్రభుత్వాలు మహిళలను కేవలం ఒక ఓట్ బ్యాంక్ గానే చూసారు. కానీ వైసీపీ ప్రభుత్వం ఏ పధకం పెట్టిన అది మహిళల పేరుతో అవ్వడం సీఎం జగన్ పాలనకు నిదర్శనం.  ప్రతి పేద వాడిని ఆదుకునే విధంగా ఈ ప్రభుత్వ పాలన ఉంటుంది. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రతిపక్ష పార్టీలు సలహాలు ఇవ్వాలి కానీ  దుష్ప్రచారం చేయకూడదు. తిరుపతిలో చంద్రబాబు, లోకేష్ సందు సందు తిరిగినా ప్రజలు ఆదరించలేదు, అందుకే హైద్రాబాద్ లో దాకున్నారని అన్నారు.
ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ సీఎం జగన్ మహిళలకు ఇస్తున్న ప్రాధాన్యత చూసి రమణి కుమారి వైసీపీ లో చేరారు. రాబోయే రోజుల్లో పార్టీ అభివృదికి మరింతగా కృషి చేయాలని కోరుతున్నాము. పార్టీ ఆమెకి సముచిత స్థానం కల్పిస్తుంది. ప్రజల సమస్యలను లేవనెత్తిన, చర్చించే ఏకైక వేదిక అసెంబ్లీ. అలాంటి అసెంబ్లీ సమావేశాలను కరోనా పేరుతో టీడీపీ బాయ్ కాట్ చేశారు. సమస్యలను ఎదుర్కోలేక  టీడీపీ అసెంబ్లీ మీ బాయ్ కాట్ చేసిందని అన్నారు.

Related Posts