బలవంతుడు, శక్తి సామర్థ్యాలు, ధైర్యవంతుడు, ఆపాయ్యత, నిజాయితీ, నిజమైన భక్తికి నిదర్శనం జై హనుమాన్. ముఖ్యంగా హనుమాన్ గురించి ఆలోచించగానే ముందుగా గుర్తొచ్చేది ఆయన బలం. ఆ ఆంజనేయ స్వామి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.
హనుమంతుని తండ్రి పేరు కేసరి. అంజన ఆ కేసరి యొక్క భార్య. అంజన యొక్క కుమారుడు ఆంజనేయుడు. ఈయన వాయుదేవుని వర ప్రభావమున జన్మించాడు.
*మనలో ఉత్తేజాన్ని నింపే ఆంజనేయుడి గొప్ప లక్షణాలు*
రామాయణం, మహాభారతంలోనే కాకుండా హనుమంతుడు వివిధ కథల్లో ప్రస్తావించారు. ఈ కథల ఆధారంగా హనుమంతుడు అంటే.. చాలా సాహసోపతమైన దైవంగా మనకు అర్థమవుతుంది. అయితే హనుమంతుడి, బలం, ధైర్య సాహసాలు, అమితమైన భక్తి మాత్రమే కాదు.. ఆంజనేయస్వామి గురించి మీకు తెలియని, మీరు గతంలో ఎప్పుడు వినని ఆసక్తికర విషయాలు మీకు పరిచయం చేయబోతున్నాం..
*రాముడిపై హనుమంతుడి విజయం*
యయాతిని చంపాలని.. విశ్వామిత్రుడిని రాముడు ఆదేశించాడు. అప్పుడు యయాతి హనుమంతుడిని సహాయం కోరాడు. అప్పుడు హనుమంతుడు తాను ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా రక్షిస్తానని యయాతికి వాగ్ధానం చేశాడు. అయితే ఈ సంగ్రామంలో హనుమంతుడు ఎలాంటి ఆయుధం ఉపయోగించలేదు. కేవలం రామనామం జపిస్తూ కూర్చున్నాడు. రామబాణాలు హనుమంతుడి దగ్గరకు వచ్చినా.. అవి ఎలాంటి హాని చేయలేదు. అలా హనుమంతుడు రాముడిపై విజయం సాధించాడు.
హనుమంతుడి ఆకలి*
సీతను కలవడానికి హనుమంతుడు వాల్మీకి ఆశ్రమానికి వెళ్లినప్పుడు తనకు సీతమ్మ వండిన ఆహారం తినాలనే కోరిక ఉందని చెప్పాడు. అప్పుడు సీతాదేవి రకరకాల వంటకాలను వండి హనుమంతుడికి వడ్డించింది. కానీ.. హనుమంతుడికి ఆకలి మాత్రం తగ్గలేదు.. ఆశ్రమంలో ఉన్న సరుకులన్నీ అయిపోవచ్చాయి. అప్పుడు సీతాదేవి రాముడిని ప్రార్థించగా.. రాముడు తులసీదళం వడ్డించడం వల్ల.. హనుమంతుడి ఆకలి తగ్గుతుందని చెప్పగా.. హనుమంతుడి ఆకలి తీరింది.
*పంచముఖి ఆంజనేయుడు*
హనుమంతుడి వివిధ రూపాల్లో.. పంచముఖిగా దర్శనమిస్తాడు. రావనాసురుడి సోదరుడైన అహిరావన్ ను రాముడు, లక్ష్మణుడు అపహరిస్తారు. అహిరావన్ ని సంహరించడానికి ఒకే ఒక మార్గం ఉంది. అది 5 దీపాలు, 5 మార్గాల్లో తీసుకెళ్లాలి. అప్పుడు హనుమంతుడు తన రూపంతో పాటు, నరసింహ, గరుడ, వరాహ, హయగ్రీవుడిగా 5 మార్గాల్లో వెళ్లాడు.
*రాముడి మరణం*
రాముడు చనిపోవడానికి హనుమంతుడు అంగీకరించలేదు. అయోధ్యలోకి యముడు ప్రవేశించకుండా అడ్డుకున్నాడు. దీంతో హనుమంతుడిని మళ్లించాలని భావించిన రాముడు తన చేతి ఉంగరాన్ని కిందకు పడేస్తాడు. దాన్ని తీసుకురమ్మని హనుమంతుడిని ఆదేశిస్తాడు రాముడు. ఉంగరం కోసం వెళ్లిన హనుమంతుడికి సర్పాలదీవికి చేరుకున్నాడు. ఇలా రాముడు తన బంటుని పక్కకు పంపి.. తన ప్రాణాలు కోల్పోయాడు.
*దేవుళ్ల అనుగ్రహం*
హనుమ పొందిన వరాలు:
శిశువుగా ఉన్నప్పుడే, ఆకలి కలిగియున్నప్పుడు, సూర్యుని ఫలమనుకొని, పొందుటకు ఎగురడం, సూర్యనివద్డ హనుమను చూచి రాహువు ఇంద్రునికి ఫిర్యాదు, ఇంద్రుడు వచ్చి వజ్రాయుధ ప్రయోగం, ఆంజనేయుని దౌడ(హనుమ)కు తగిలి నిర్జీవుడై పడిపోవడం జరిగింది. అదిచూసి, వాయుదేవుడు సకల జీవరాశి నుంచి బయటకు వచ్చి సమ్మె చేశాడు. అప్పుడు బ్రహ్మదేవుడు దేవతలతో వచ్చి, ఆంజనేయుని పునర్జీవితుని చేశాడు. వాయువుకి సంతోషం కలిగించడానికీ, భవిష్యత్తులో దేవతల గొప్పకార్యాన్ని మారుతి నిర్వహించడానికీ, దేవతలందఱినీ మారుతికి వరాలిమ్మన్నాడు....
ఓం నమో నారాయణాయ