YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

గాంధీ ఆస్పత్రిని సందర్శించిన సీఎం కేసీఆర్ కరోనా రోగులకు ధైర్యం.. డాక్టర్లకు అభినందన - సీఎం కేసీఆర్

గాంధీ ఆస్పత్రిని సందర్శించిన సీఎం కేసీఆర్ కరోనా రోగులకు ధైర్యం.. డాక్టర్లకు అభినందన - సీఎం కేసీఆర్

హైదరాబాద్
సికింద్రాబాద్ లోని గాంధీ ఆస్పత్రిని ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం మధ్యాహ్నం సందర్శించారు. కరోనా రోగులకు అందుతున్న సేవలను పరిశీలించారు.  కరోనా ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతున్న రోగులను సీఎం పరామర్శించి, ధైర్యంగా ఉండాలని చెప్పారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న డాక్టర్లను సీఎం కేసీఆర్ అభినందించారు. కొవిడ్ చికిత్సతో పాటు ఆక్సిజన్, ఔషధాల లభ్యతను పరిశీలించారు.  ప్రస్తుతం వైద్య ఆరోగ్యశాఖను సీఎం కేసీఆర్ స్వయంగా పర్యవేక్షిస్తున్న విషయం తెలిసిందే. సీఎం కేసీఆర్ వెంట మంత్రి హరీష్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, వైద్యారోగ్య శాఖ అధికారులు ఉన్నారు. సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో గాంధీ ఆస్పత్రి వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. రోగుల సహాయకులను బయటకు పంపించేశారు.  గాంధీ ఆస్పత్రి ప్రాంగణంలో రసాయనాలతో పిచికారీ చేశారు.

Related Posts