YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

తౌక్టే తుఫాన్ బీభ‌త్సాన్ని ప్ర‌ధాని మోదీ ఏరియ‌ల్ స‌ర్వే

తౌక్టే తుఫాన్ బీభ‌త్సాన్ని ప్ర‌ధాని మోదీ ఏరియ‌ల్ స‌ర్వే

అహ్మ‌దాబాద్ మే 19
తౌక్టే తుఫాన్ బీభ‌త్సం సృష్టించిన విష‌యం తెలిసిందే. గుజ‌రాత్‌ రాష్ట్రంలో తౌక్టే భారీ న‌ష్టాన్ని మిగిల్చింది. అతి భీక‌రంగా విరుచుకుప‌డ్డ తుఫాన్‌తో భారీ ఆస్థి న‌ష్టం సంభ‌వించిన‌ట్లు తెలుస్తోంది. ప్ర‌ధాని మోదీ ఇవాళ గుజ‌రాత్‌లో ఏరియ‌ల్ స‌ర్వే నిర్వ‌హించారు. తుఫాన్ ప్ర‌భావిత ప్రాంతాల‌ను ఆయ‌న ఏరియ‌ల్ స‌ర్వే ద్వారా ప‌రిశీలించారు. ఉనా, డ‌యూ, జ‌ఫ‌రాబాద్‌, మ‌హువా ప్రాంతాల్లో ఆయ‌న స‌ర్వే నిర్వ‌హించారు. ప్ర‌భావానికి గురైన ప్రాంతాల్లో జ‌రిగిన న‌ష్టాన్ని ఇంకా అంచ‌నా వేయ‌లేదు. మ్యాప్‌ల‌ను, శాటిలైట్ ఇమేజ్‌ల‌ను ఆయ‌న ప‌రిశీలించారు. గుజ‌రాత్‌లోని కోస్ట‌ల్ జిల్లాల‌ను ఆయ‌న స‌ర్వేలో ప‌రిశీలించారు. ఎంత న‌ష్ట‌ప‌రిహారం ఇవ్వాల‌న్న దానిపై త్వ‌ర‌లో ప్ర‌క‌ట‌న చేసే అవ‌కాశాలు ఉన్నాయి. అహ్మ‌దాబాద్‌లో మ‌రికాసేప‌ట్లో ప్ర‌ధాని మోదీ స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించ‌నున్నారు.

Related Posts