YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కొవిడ్ వ్యాక్సిన్ కోసం గ్లోబ‌ల్ టెండ‌ర్ల‌ను ఆహ్వానించిన తెలంగాణా ప్ర‌భుత్వం

కొవిడ్ వ్యాక్సిన్ కోసం గ్లోబ‌ల్ టెండ‌ర్ల‌ను ఆహ్వానించిన తెలంగాణా ప్ర‌భుత్వం

హైద‌రాబాద్ మే 19
 క‌రోనా నియంత్ర‌ణ‌కు రాష్ర్ట ప్ర‌భుత్వం ప‌క‌డ్బందీ చ‌ర్య‌లు తీసుకుంటోంది. క‌రోనా నివార‌ణ‌కు తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై ప్ర‌భుత్వం ఎప్ప‌టిక‌ప్పుడు స‌మీక్షిస్తోంది. రాష్ర్టంలోని అంద‌రికీ టీకా ఇవ్వాల‌నే ఉద్దేశంతో.. కొవిడ్ -19 వ్యాక్సిన్ కోసం గ్లోబ‌ల్ టెండ‌ర్ల‌ను ప్ర‌భుత్వం ఆహ్వానించింది. ఈ మేర‌కు ప్ర‌భుత్వం షార్ట్ టెండ‌ర్ నోటిఫికేష‌న్ జారీ చేసింది. గ్లోబ‌ల్ టెండ‌ర్ల ద్వారా 10 మిలియ‌న్ డోసుల వ్యాక్సిన్‌ను ప్ర‌భుత్వం సేక‌రించ‌నుంది. ఆన్‌లైన్ ద్వారా బిడ్ల దాఖ‌లు కోసం జూన్ 4 చివ‌రి తేదీ. 6 నెల‌ల్లో 10 మిలియ‌న్ డోసుల వ్యాక్సిన్‌ను స‌ర‌ఫ‌రా చేయాల‌ని ప్ర‌భుత్వం నిబంధ‌న విధించింది. సప్ల‌య‌ర్ నెల‌కు 1.5 మిలియ‌న్ డోసులను విధిగా స‌ర‌ఫ‌రా చేయాల్సి ఉంటుంది. రాష్ర్టంలో మొత్తం 4 కోట్ల మందికి వ్యాక్సిన్‌ను ఇవ్వాల‌ని ఇప్ప‌టికే రాష్ర్ట ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన విష‌యం విదిత‌మే.
 

Related Posts