హైదరాబాద్, మే 19
అమృత విశ్వ విద్యాపీఠం సెంటర్ ఫర్ నానోసైన్స్ అండ్ మాలిక్యులర్ మెడిసిన్ విద్యార్థుల నుండి వారి ఎం టెక్, ఎం.ఎస్సి మరియు బి.ఎస్సి మరియు తత్సమాన డిగ్రీ చదువ గోరే విద్యార్దుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు అమృత విశ్వవిద్యాలయం ప్రకటించింది. (ఎంఎస్,ఎం.టెక్,+ఎంఎస్,) 2021 విద్యా సంవత్సరానికి గాను యుఎస్ఏ లోని అరిజోనా విశ్వవిద్యాలయ సహకారంతో వీటిని నిర్వహిస్తున్నట్లు తెలిపింది.
ఎం.టెక్ పోగ్రామ్స్ : ఎం టెక్. నానోబయోటెక్నాలజీలో, ఎం. టెక్. నానోసైన్స్ & టెక్నాలజీలో, ఎం. టెక్. మాలిక్యులర్ మెడిసిన్ లో
అర్హత: కింది విభాగాలలో బ్యాచిలర్ డిగ్రీ లేదా బిఇ / బిటెక్ డిగ్రీ - బయోటెక్నాలజీ, జెనెటిక్ ఇంజనీరింగ్, బయోమెడికల్ ఇంజనీరింగ్, ఫుడ్ ప్రాసెస్ ఇంజనీరింగ్, బయోఇన్ఫర్మేటిక్స్, అగ్రికల్చరల్ ఇంజనీరింగ్, అగ్రికల్చరల్ అండ్ ఇరిగేషన్ ఇంజనీరింగ్, ఫార్మాస్యూటికల్ ఇంజనీరింగ్, ఫుడ్ టెక్నాలజీ మరియు ఏదైనా ఇతర బయో ఇంజనీరింగ్ సంబంధిత గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి కనీసం 60% మార్కులు లేదా సమానమైన కోర్సులు. లేదా మాలిక్యులర్ బయాలజీ, మెడికల్ బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ, బయోమెడికల్ సైన్సెస్, బయోటెక్నాలజీ, బోటనీ, జువాలజీ, మెడికల్ జెనెటిక్స్, బయోకెమిస్ట్రీ, బయోఇన్ఫర్మేటిక్స్, ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, ఎన్విరాన్‌మెంటల్ హెల్త్ సైన్సెస్, అప్లైడ్ సైకాలజీ, నర్సింగ్, అలైడ్ హెల్త్ సైన్సెస్, ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ, అగ్రికల్చర్, హార్టికల్చర్ అండ్ సెరికల్చర్ లేదా కనీసం 60% మార్కులు లేదా సమానమైన ఏదైనా బయోసైన్స్ కోర్సు. లేదా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి కనీసం 60% మార్కులతో మెడిసిన్, డెంటిస్ట్రీ, వెటర్నరీ, ఆయుర్వేదం, హోమియోపతి మరియు ఫార్మసీలలో ప్రొఫెషనల్ డిగ్రీ లేదా సమానమైన డిగ్రీ. ఎం.ఎస్సి కార్యక్రమాలు: ఎం.ఎస్సి (నానోబయోటెక్నాలజీ), ఎం.ఎస్సి. (నానోసైన్స్ అండ్ టెక్నాలజీ), ఎం.ఎస్సి (మాలిక్యులర్ మెడిసిన్)
అర్హత: మెడికల్ నానోబయోటెక్నాలజీ, నానోటెక్నాలజీ, బయోమెడికల్ సైన్సెస్, మెడికల్ జెనెటిక్స్, మెడికల్ మైక్రోబయాలజీ, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, బయోఇన్ఫర్మేటిక్స్, హెల్త్ ఇన్ఫర్మేటిక్స్, క్లినికల్ రీసెర్చ్, ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్.