YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

ఒడిసి పట్టాలి వృధా నీరు

ఒడిసి పట్టాలి వృధా నీరు

వేసవిలో దేశవ్యాప్తంగా సాగునీటికి సమస్యలు ఏర్పడుతున్నాయి. తగినంతగా సాగునీరు లేకపోవడంతో పంటలు వాడిపోవడమే కాక ఎండిపోతున్నాయి. తెలంగాణలోనూ ఇలాంటి దుస్థితిని రైతాంగం ఎదుర్కొంటోంది. పంటలను కాపాడుకునేందుకు నానాపాట్లు పడుతోంది. భూగర్భ జల మట్టాలు ప్రమాదకర స్థాయికి దిగజారిపోవడమే దీనికి కారణం. దీంతో జల సంరక్షణకు టీఆర్ఎస్ సర్కార్ ప్రాధాన్యతనిస్తోంది. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో పాటూ రాష్ట్రవ్యాప్తంగా చెరువులు తవ్విస్తోంది. ఉన్న చెరువులను పునరుద్ధరిస్తూ.. జలవనరులను ఒడిసిపడుతోంది. అయినప్పటికీ పలు ప్రాంతాల్లో సాగునీటి కొరత ఉంటోంది. ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం, అధికార యంత్రాంగం కృషి చేస్తోంది. వృధా నీటిని వ్యవసాయక్షేత్రాలకు మళ్లించేందుకు చర్యలు తీసుకుంటోంది. ఇదిలాఉంటే సూర్యాపేట జిల్లాలో మూసీనది నీరు కృష్ణానదిలో కలిసి సముద్రంలో చేరుతోంది. అలా వృథాగా సముద్రంలో కలిసే నీటిని కొంతమేర ఇక్కడే నిల్వ చేయాలని అధికారులు భావిస్తున్నారు. అలా చేస్తే ఈ ప్రాంతంలో భూగర్భజలాలు వృద్ధి చెంది బోర్లు, బావుల్లో నీరు సమృద్ధిగా దొరుకుతుందని అంచనా వేస్తున్నారు. 

మూసీ ప్రాజెక్టు దిగువన ఏటిలో పన్నెండు చోట్ల చెక్‌డ్యాంలు నిర్మించి ఆయా ప్రాంతాల్లోని బీడు భూములకు సాగునీరు, పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలాలను పైకి తెచ్చేందుకు ప్రభుత్వం అవసరమైన ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ చెక్‌డ్యాంలు అందుబాటులోకి వస్తే ఉమ్మడి జిల్లాలోని అనేక గ్రామాల్లో సాగు, తాగునీటి ఇబ్బందులు తొలగిపోతాయని అధికారులు చెప్తున్నారు. మూసీ ప్రాజెక్టు దిగువన 12 చోట్ల చెక్‌డ్యాంలు నిర్మించి వాటికి ఆనుకొని ఉన్న 6030 ఎకరాల భూమిని సాగులోకి తీసుకురావాలన్న ప్రతిపాదన ఉంది. ఇందుకు మూసీ ఏటి పరివాహక వివిధ గ్రామాల్లోని 12 ప్రదేశాలను అధికారులు ప్రతిపాదించారు. చెక్ డ్యాంలు పూర్తైతే వర్షాకాలంలో ఈ డ్యాంలు ఒకదాని తర్వాత మరొకటి నిండి సాగుకు అండగా ఉండే అవకాశం ఉంది. మూసీ ప్రాజెక్టు నీరు వృథా కాకుండా అవసరమైన చోట్ల చెక్‌డ్యాంలు నిర్మించి వాటివెంట ఉన్న బీడు భూములను సస్యశ్యామలం చేస్తామని గతేడాదిలోనే సూర్యాపేట పర్యటనలోసీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారు. ఆయన మాటలతో కదిలిన అధికార యంత్రాంగం సర్వే చేసి ప్రభుత్వానికి నివేదికను అందించింది. ముఖ్యమంత్రి వాగ్ధానం చేసినట్లుగా చెక్ డ్యాంలు నిర్మితమైతే స్థానిక వ్యవసాయ క్షేత్రాల్లో పచ్చదనం పరచుకుంటుంది. రైతన్నలు మంచి వ్యవసాయ దిగుబడులు సాధించగలరు. 

Related Posts