రంగారెడ్డి, మే 19,
శాన్ని కరోనా మహమ్మారి పట్టి పీడిస్తోంది. కరోనా సోకిన వారి పరిస్థితి చాలా దారుణంగా ఉంటోంది. రెండు వారాల పాటు కుటుంసభ్యులు, స్నేహితులకు దూరంగా ఒంటరిగా ఐసోలేషన్‌లో ఉండటమన్న చాలా కష్టం. అందువల్లే కరోనా సోకిన వారిలో చాలామంది మనోవేదనకు గురవుతున్నాయి. కరోనాతో చనిపోతే సొంత రక్త సంబంధీకులే దగ్గరకు రాని పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో కరోనాతో చనిపోయిన వారి శరీరంపై ఉన్న విలువైన ఆభరణాలున్నా తీయాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. ఇలాంటి ఘటనే మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా కీసరలో చోటుచేసుకుంది. కీసరకు చెందిన ఓ వృద్ధురాలు కరోనాతో మృతి చెందింది. కుటుంబసభ్యులు ఆమె మృతదేహాన్ని శ్మశాన వాటికకు తీసుకొచ్చారు. ఆమె ఒంటిపై రూ.లక్షకు పైగా విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలు ఉన్నాయి. వాటిని తీసేందుకు కుటుంబసభ్యులు భయపడ్డారు. ఇందుకోసం ఓ వ్యక్తిని పురమాయించారు. ఆ వ్యక్తి మృతురాలి ఒంటిపై ఉన్న బంగారు, వెండి ఆభరణాలను తీసి కుటుంబసభ్యులకు అందజేశారు. ఇందుకోసం అతడు ఏకంగా రూన14వేలు తీసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా హాట్‌టాపిక్‌గా మారింది.