YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

రైతులకోసం కొత్త ఐడియాను ఆవిష్కరించిన మాజీ ఎంపీ కొండా

రైతులకోసం కొత్త ఐడియాను ఆవిష్కరించిన మాజీ ఎంపీ కొండా

హైదరాబాద్ మే 19
ఈ ఏడాది వరిధాన్యం చాలా ఎక్కువ దిగుబడి వచ్చింది. రైతులకు ఒక పక్క కరోనా సమస్య దానికి మించి దిగుబడి అయిన పంటలను సరిగా కొంటలేరు. మరోపక్క అకాల వర్షాలు. అయితే ఇటీవల కాలంలో పడుతున్న ఈ చెడ్డ వానల వల్ల తెలంగాణాలోని అనేక ప్రాంతాల్లో గోదాముల వద్ద రైతులు పండిన ధాన్యం తడిసి ముద్దైపోతుంది. ఈ తడిచిన వడ్లను కొనేందుకు అటు ప్రభుత్వం, ఇటు మిల్లర్లు అంతాగా ఆసక్తి చూపడంలేదు. దీంతో వర్షాలకు ధాన్యం తడిచిపోకుండా ఉండేందుకు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఒక కొత్త ఆలోచనచేశారు.ఆరుగాలం కష్టపడి పనిచేసి పండించిన ధాన్యం వానకు తడిచిపోతుంటే రైతులు బాధలు వర్ణాతీతం. ఎప్పుడూ కొత్త కొత్త ప్రయోగాలు, ప్రజలకు ఉపయోగపడే నూతన ఆవిష్కరణు చేపల్టే మాజీ ఎంపీ కొండావిశ్వేశ్వర్ రెడ్డి కేవలం 500 రూపాయల ఖర్చుతో ఆరబోసిన లేదా గోదాముల బయట ఎండబెట్టిన ధాన్యాన్ని వర్షంనుంచి కాపాడుకోవ్చని ప్రాక్టికల్ గా చేసి చూపించారు. మొదటగా (వీడియోలో చూపించినట్లు) ఒక టార్ప్ లైన్ కింద పర్చి దాని మీద ధాన్యం బస్తాలను రాశులుగా పోయాలి.  ధాన్యం బస్తాల చుట్టు పర్చిన టార్ప్ లైన్ పైకి మడిచి దానితో పాటు  మార్కెట్ లో దొరికే ప్లాస్టిక్ కవర్ (ష్రింక్ వ్రాప్) (shrink wrap or skin wrap) పల్చటి పొరలాంటి ప్లాస్టిక్ కవర్ తో పూర్తిగా చుట్టివేయాలి.  ధాన్యం బస్తాలలో ఉంచినదే కాకుండా రాశిగా పోసి దాని చుట్టూ బొంగులు లేదా కడ్డిలు  పేర్చి ఈ ప్లాస్టిక్ కవర్ తో చుడితే ధాన్యం తడవదు.  ఇది పద్దతి టార్పైలైన్ (Tarpaulins) లేకున్నా రాళ్ల మీద వేసిన బస్తాలకు, ఇటుకల మీద పెట్టిన బస్తాలకు కూడా ఈ పేపర్ చుడితే సరిపోతుంది. ఈ పద్దతిలో అసలు టార్ప్ లైన్ అవసరంఉండదు.  బయట మార్కెట్ లో ఒక్కో టార్ప్ లైన్ ధర క్వాలిటీని బట్టి సుమారు 8వేల వరకు ఉంది. కింద వేసిన టార్ప్ లైన్ 2వేల రూపాయలు, స్కిన్ వ్రాప్ 500 రూపాయలు ఖర్చు అవుతుంది. దీంతో 100 కింట్వాళ్ల ధాన్యాన్ని కాపాడుకోవచ్చు.  రెండు మూడు  వారలనుంచి రెండుమూడు నెలల వరకు ఇందులోనే ధాన్యాన్ని ఉంచవచ్చు.  ఇక ఎలకలు ధాన్యం కొట్టకుండా కింద ఒక రేకు షీట్ (వీడియోలో చెప్పిన విధంగా) వేసుకుంటే సరిపోతుంది. ఇది ప్రస్తుతం అకాల వర్షాలతో ఇబ్బందులు పడుతున్న రైతులకు ఎంతోగానో ఉపయోగపడుతుంది.  తెలంగాణల రైతులు చానా బాధల ఉన్నరు. ఒక్క పక్క కరోనా, ఇంకొక పక్క రైతులకు వాళ్ళ సొంత సమస్యలు. ప్రభుత్వం పంట కొనుగోలు మెల్లెగ చేస్తుంది, ఇంతలనే అకాల వర్షాలు పండించిన పంటలను నాశనం చేస్తున్నై. గోడౌన్లు నిండిపోయినై. తాటిపత్రిల ఖర్చు ఎక్కువ. అతి తక్కువ ఖర్చతో అకాల వర్షాల నుంచి పంటను కాపాడుకోవడానికి రైతులకోసం ఈ ప్రయోగమని అయన అన్నారు.

Related Posts