అమరావతి మే 19
కొవిడ్ సంక్షోభ సమయంలో ప్రభుత్వంపై చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. రఘురామకృష్ణరాజు వెనుక చంద్రబాబు ఉండి నడిపిస్తున్నారని విమర్శించారు. కరోనా నిబంధనలు పాటిస్తూ అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఏ అంశంపైనైనా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.కరోనా కట్టడికి ఏపీ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు. ఆక్సిజన్ కొరత లేకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని స్పష్టంచేశారు.