YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి

ఉపాధి కూలీలకు ఊతంగా పెరిగిన పనిదినాలు

ఉపాధి కూలీలకు ఊతంగా పెరిగిన పనిదినాలు

ఉపాధి వలసలను నిరోధించి గ్రామీణ ప్రాంతాల్లో కూలీలకు స్వస్థలాల్లోనే పనులు కల్పించేందుకు కేంద్రం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేస్తోంది. కూలీలకు పూర్తిస్థాయిలో పనులు కల్పిస్తూ వారికి ఆర్ధికంగా చేయూతనిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ పథకాన్ని సమర్ధవంతంగా అమలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నాయి. గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. కేంద్రం నుంచి అదనపు పని దినాలు మంజూరు చేయించుకోవాలని భావిస్తోంది. కూలీలు పనులు చేసేందుకు ఉత్సాహం చూపుతున్న సమయంలోనే ఈ పని చేయాలని అనుకుంటోంది. ఏప్రిల్‌, మే, జూన్‌..ఈ మూడు నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా 10 కోట్ల పని దినాలు కల్పించాలని అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో పనుల తీరు, జాబ్‌కార్డులను దృష్టిలో పెట్టుకుని జిల్లాల వారీగా నెలవారీ లక్ష్యాలు నిర్దేశించారు. జిల్లాకు కేటాయించిన పనిదినాల సంఖ్య ఆధారంగా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు పంచాయతీల వారీగా విభజించారు. దీంతో జిల్లా పరిధిలో 1,76,588 జాబ్‌ కార్డులు, 4,02,254 మంది కూలీలు ఉన్నట్లు తేలింది.

అధికార యంత్రాంగం చొరవతో మూడు నెలల ప్రణాళికలో భాగంగా మెదక్‌ జిల్లాకు 30.5 లక్షల పని దినాలు మంజూరయ్యాయి. దీంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. ఇదిలాఉంటే ఇప్పటికే కేటాయించిన పనులతో పాటూ మరిన్ని పనిదినాలు జిల్లాకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి లక్ష్యం మేరకు పూర్తి చేస్తే జిల్లాకు అదనపు పని దినాలు మంజూరయ్యేందుకు అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. మే నెలలో అత్యధికంగా 14.5 లక్షల పనిదినాలు పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. అయితే మేలో ఉష్ణోగ్రతల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే ఎండల్లో పనులు చేస్తున్న పలువురు కూలీలు వేసవి తాపానికి గురయ్యారు. ముగ్గురు ఉపాధి కూలీలు వడదెబ్బకు గురై మృత్యువాతపడ్డారు. దీంతో ఉదయం, సాయంత్రం వేళల్లో పనులు జరిగేలా పనివేళల్లో మార్పులు చేయాలని కూలీలు అధికారులను కోరుతున్నారు. అంతేకాక పని ప్రదేశాల్లో టెంట్లు వేయడంతోపాటు, తాగునీటి వసతి కల్పించాలని, ఓఆర్‌ఎస్‌ పాకెట్‌లు అందుబాటులో ఉంచాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Related Posts