YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

సంస్కరణలతో ముందడుగు

సంస్కరణలతో ముందడుగు

తెలంగాణ సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోంది. అభివృద్ధి పాలసీలు ప్రతీ రంగానికి విస్తరించి మెరుగైన ఫలితాలు సాధించేందుకు యత్నిస్తోంది. పార్టీ 17వ ప్లీనరీలోనూ రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నిలపడమే ధ్యేయమని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టంచేశారు. ఆయన అభిమతానికి అనుగుణంగానే రాష్ట్రంలో విద్యాశాఖను బలోపేతం చేసేందుకు అధికారులు చర్యలు ముమ్మరం చేశారు. సర్కారీ బడుల్లో వసతులు పెంచడంతో పాటూ విద్యార్ధులకు నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నల్గొండలో విద్యా విభాగంలో సంస్కరణలు వేగవంతమయ్యాయి. విద్యావ్యవస్థను బలోపేతం చేసేందుకు వేర్వేరుగా ఉన్న సర్వశిక్ష అభియాన్‌, రాజీవ్‌ మాధ్యమిక శిక్షాభియాన్‌లను  విద్యాశాఖలో విలీనం చేయనున్నారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు త్వరలో రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఆ శాఖలోని అన్ని విభాగాలు డీఈవో పర్యవేక్షణలో పనిచేయనున్నాయని సమాచారం. భవిష్యత్తులో ఇంటర్మీడియట్‌ను ఎన్‌సీఈఆర్టీలో విలీనం చేసే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. విద్యాశాఖ బలోపేతానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతో పాటూ సంస్కరణు వేగవంతం చేయడంతో విద్యార్ధి సంఘాలు హర్షం వ్యక్తంచేస్తున్నాయి.

ఉమ్మడి నల్గొండ వ్యాప్తంగా 3182 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో సుమారు 2,40,709 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీటిపై విద్యాశాఖ అధికారికి నియంత్రణ బాధ్యతలు ఉండేవి. సర్వశిక్షాభియాన్‌కు జిల్లాస్థాయిలో ఒక ప్రాజెక్టు అధికారితో పాటు ఒక కార్యాలయం ఉండేది. ఆర్‌ఎంఎస్‌ఏకు రాష్ట్రస్థాయిలో మాథ్యమిక శిక్షాభియాన్‌ కార్యాలయం, సిబ్బంది ఉంటారు. ఇలా ప్రభుత్వ పాఠశాలను మొత్తంగా మూడుశాఖల నియంత్రిస్తున్నాయి. అంతేకాక నిధుల మంజూరు బాధ్యతలనూ అవే పర్యవేక్షించేవి. దీంతో ఏ నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయో, అవి ఎలా ఖర్చు అవుతున్నాయనే విషయంపై విద్యాశాఖకు సందిగ్ధత ఉండేది. సరైన సమాచారం కూడా ఉండేది కాదు. దీనికితోడు సర్వశిక్షాభియాన్‌ ప్రాజెక్టు అధికారి పరిధిలో కొంతమంది సిబ్బంది, జిల్లా విద్యాశాఖ అధికారి పరిధిలో మరికొంతమంది సిబ్బంది ఉండేవారు. ప్రస్తుతం అన్నిశాఖల విలీనంతో ఉద్యోగుల కుదింపు ఉంటుంది. ఒకే యాజమాన్యం ద్వారా నిధుల మంజూరు ఉండనుంది. దీంతో పాఠశాల అవసరాలకు అనుగుణంగానే నిధులు మంజూరవుతాయని, వృథా ఖర్చులు తగ్గుతాయని అధికారులు భావిస్తున్నారు.  

Related Posts