YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కల్వకుర్తి అసుపత్రిని పరిశీలించిన మంత్రి నిరంజన్ రెడ్డి

కల్వకుర్తి అసుపత్రిని పరిశీలించిన మంత్రి నిరంజన్ రెడ్డి

మహబూబ్ నగర్
నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి ఏరియా ఆసుపత్రిని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గురువారం సందర్శించారు. అక్కడి కరోనా రోగులను పరామర్శించారు. ఈ కార్యక్రమానికి న ఎంపీ రాములు, ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు, కలెక్టర్ శర్మన్ తదితరులు హజరయ్యారు. మంత్రి మాట్లాడుతూ వైద్యరంగానికి ఈ సమాజం రుణపడి ఉంటుంది.  కరోనా విపత్తులో డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది, ఏఎన్ఎం, ఆశావర్కర్ల సేవలు అభినందనీయం.  కరోనా ప్రబలకుండా వారు చేస్తున్న కృషి గొప్పది.  కరోనా సోకిందని అధైర్యపడవద్దు. ధైర్యమే మిమ్మల్ని కాపాడుతుంది.  వైద్యుల సూచనల ప్రకారం మందులు వాడుతూ హోం ఐసోలేషన్ పాటించండని అన్నారు.  అధైర్యంగా ఉన్న వారిలోనే ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు.  కరనా విపత్తును ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్దంగా ఉంది.  త్వరలోనే ఈ కరోనా నుండి బయటపడతామని ఆశిస్తున్నాం.  ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం లాక్ డౌన్ పొడిగించింది.  ప్రజలు సంపూర్ణంగా సహకరించి కరోనా నివారణకు పాటుపడాలని అన్నారు.

Related Posts