హైదరాబాద్, శుక్రవారం పదోతరగతి ఫలితాలు విద్యార్థులందరూ పాస్.. ఎఫ్ఏ–1లో వారు సాధించిన మార్కులను బట్టి గ్రేడ్లు
పదోతరగతి విద్యార్థుల ఫలితాలను ఈ నెల 21న విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల విభాగం ఏర్పాట్లు చేసింది. ఇందుకు గాను ఫలితాలకు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేసింది. ఒకవేళ ఆ రోజు వీలుకాకపోతే మరుసటి రోజు విడుదల చేయనుంది. కరోనా కారణంగా ఈసారి పదో తరగతి పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసింది. తెలంగాణ రాష్ట్రంలోని 5.21 లక్షల మంది పదో తరగతి విద్యార్థులందరినీ ఉత్తీర్ణులను చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. విద్యార్థులకు ఫార్మేటివ్ అసెస్మెంట్ (ఎఫ్ఏ–1)లో వచ్చిన మార్కులను పరిగణనలోకి తీసుకోనుంది.