YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

నిర్మాత, దర్శకుడు యూ విశ్వేశ్వరరావు కన్నుమూత

నిర్మాత, దర్శకుడు యూ విశ్వేశ్వరరావు కన్నుమూత

హైదరాబాద్
సీనియర్ నిర్మాత, దర్శకుడు యూ. విశ్వేశ్వరరావు ఈ రోజు ఉదయం చెన్నై లో కరొనాతో కన్ను మూశారు. ఎన్టీఆర్ తో కంచుకోట, నిలువుదోపిడీ, దేశోద్ధారకులు, పెత్తందార్లు చిత్రాలు నిర్మించారు. ఎన్టీఆర్, పృథ్వీరాజ్ కపూర్ కాంబినేషన్ లో కంచు కాగడా చిత్రాన్ని నిర్మించాలని అనుకొన్నారు కానీ ఆ ప్రాజెక్ట్ ముందుకు సాగలేదు. ఆ తర్వాత దర్శకుడిగా మారి తీర్పు, మార్పు, నగ్న సత్యం, కీర్తి కాంతా కనకం, పెళ్లిళ్ల చదరంగం చిత్రాలు రూపొందించారు. తీర్పు చిత్రంలో ఎన్టీఆర్ జడ్జిగా నటించారు. మార్పు సినిమాలో విశ్వేశ్వరరావు గురువు , దర్శకుడు పి. పుల్లయ్య నటించారు. అటు ఆర్ట్ సినిమాలు చేస్తూనే కమర్షియల్ కథలతో చిత్రాలు చేసి సక్సస్ సాధించారు. నగ్నసత్యం, హరిశ్చంద్రుడు, కీర్తి కాంత కనకమ్ సినిమాలకి బెస్ట్ డైరెక్టర్ అవార్డులు అందుకున్నారు.  దాదా సాహెబ్ ఫాల్కే బాంబే పురస్కారన్ని అందుకున్న విశ్వేశ్వర రావు గారు 17వ నేషనల్ అవార్డ్స్ కమిటీ జ్యురీ మెంబర్ గా పని చేసిన ఈయన మరణం ఇండస్ట్రీకి తీరని లోటనే చెప్పాలి. కరోన కారణంగా మరణించిన ఆయన ఆత్మకి శాంతి చేకూరలని తెలుగు నిర్మాత మండలి సంతాపం తెలియజేసింది. ఈయన నందమూరి తారక రామారావు గారి వియ్యంకుడు మరియు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్, ఎఫ్ డి సి డైరెక్టర్ చైర్మన్, సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ లో అనేక పదవులు కూడా నిర్వహించారు.

Related Posts