YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

కేరళ ముఖ్యమంత్రిగా పినరయి విజయన్ ప్రమాణస్వీకారం

కేరళ ముఖ్యమంత్రిగా పినరయి విజయన్ ప్రమాణస్వీకారం

తిరువనంతపురం మే 20
కేరళ ముఖ్యమంత్రిగా పినరయి విజయన్ గురువారం ప్రమాణస్వీకారం చేశారు. తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో గవర్నర్ ఆరిఫ్ మహ్మద్‌ఖాన్ విజయన్‌ చేత రెండోసారి సీఎంగా ప్రమాణం చేయించారు. కాగా విజయన్‌తో పాటు 21 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.అయితే రాష్ట్రంలో గతేడాది కరోనా కట్టడిలో ఆరోగ్య శాఖ మంత్రిగా కీలకపాత్ర పోషించిన కేకే. శైలజకు మంత్రి వర్గంలో చోటుదక్కలేదు. ఆమె స్థానంలో వీణా జార్జ్‌కు ఆరోగ్య శాఖ కేటాయించారు. ఇక పినరయి విజయన్‌ అల్లుడు మహ్మద్‌ రియాస్‌కు పబ్లిక్‌ అండ్‌ టూరింజ్‌ శాఖను అప్పగించారు.ఇక కేబినెట్‌లో చేరిన వారంతా అంద‌రూ కొత్త‌వారే. ఈ సంద‌ర్భంగా సీఎం విజ‌యన్‌తో పాటు మంత్రుల‌కు గ‌వ‌ర్న‌ర్, ఇత‌ర ప్ర‌ముఖులు శుభాకాంక్ష‌లు తెలిపారు.కాగా మే2న వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో రాష్ట్రంలోని మొత్తం 140 సీట్లకు గాను, 99 సీట్లను ఎల్డీఎఫ్‌ కైవసం చేసుకుంది. ప్రతిపక్ష యూడీఎఫ్‌ 41 స్థానాల్లో గెలుపొందింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ రెండోసారి గెలవదనే సంప్రదాయాన్ని చెరిపేసిన విజయన్‌ నేతృత్వంలోని ఎల్డీఎఫ్‌ 40 ఏళ్ల చరిత్రను తిరగరాసి కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది.

Related Posts