YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

కమల్ కు మరోషాక్

కమల్ కు మరోషాక్

చెన్నై, మే 20, 
మిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కమల్ హాసన్ పార్టీ మక్కల్ నీధి మయ్యమ్ (ఎంఎన్ఎం) ఒక్క సీటు కూడా దక్కలేదు. కోయంబత్తూరు దక్షిణ నుంచి పోటీచేసిన ఆయన కూడా ఓటమి చవిచూశారు. ఎన్నికల్లో ఓటమి నుంచి తేరుకోక ముందే కమల్ హాసన్‌కు వరుస దెబ్బలు తగులుతున్నాయి. ఫలితాలు వెలువడిన మర్నాడే కీలక నేతలు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తాజాగా, ఎంఎన్ఎంకి కీలక నేత సీకే కుమారవేల్ సహా మరో ఆరుగురు రాజీనామా చేశారు. వ్యక్తి పూజకు తావులేదని కుమార్‌వేల్ రాజీనామా అనంతరం వ్యాఖ్యానించారు.ఎన్నికల్లో పార్టీ స్ట్రాటజీ టీం తప్పుడు విధానాలను అవలంభించిందని ఆరోపించారు. ‘‘వ్యక్తిపూజకు ఆస్కారం లేదు.. లౌకికవాద ప్రజాస్వామ్య రాజకీయాల్లో ప్రయాణించాలనుకుంటున్నా.. మేము చరిత్రను సృష్టించాల్సి కానీ, మేము చరిత్రనను చదువుతున్నాం’’ అని కమల్‌కు కుమార్‌వేల్ చురకలంటించారు. ఎంఎన్ఎం ఉపాధ్యాక్షుడు ఆర్ మహేంద్రన్, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సంతోష్ బాబులు రాజీనామా చేయగా.. చెన్నైలోని ఓ స్థానం నుంచి పోటీచేసిన పర్యావరణ కార్యకర్త పద్మ ప్రియ సైతం వ్యక్తిగత కారణాలతో తప్పుకున్నారు.అలాగే, మరో నేత ఎం మురుగానందమ్ బుధవారం రాజీనామా చేశారు. ఈ సందర్భంగా పార్టీపై విమర్శలు గుప్పించారు. ప్రజాస్వామ్యం, నిజాయతీ లేకపోవడమే పార్టీ నుంచి తప్పుకోడానికి కారణమని తన రాజీనామా లేఖను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ‘‘నిజాయతీ, స్వతంత్రంగా ప్రజలకు సేవచేయాలనే ఉద్దేశంతో ఎంఎన్ఎంలో చేరా.. కానీ, ఈ రోజున అందుకు భిన్నమైన పరిస్థితి ఉంది... పార్టీ ప్రాథమిక సభ్యత్వం సహా అన్ని పదవులకు రాజీనామా చేస్తున్నా’’ అని పేర్కొన్నారు.ఎన్నికల్లో బలహీనమైన పార్టీలతో పొత్తు ఎంఎన్ఎమ్ ప్రతిష్ఠను తీవ్రంగా దెబ్బతీసిందని మురుగనందం అన్నారు. కమల్ హాసన్‌ను కొంతమంది తప్పుదారి పట్టించారని, ఏకపక్షవాదం, నిరంకుశత్వం పార్టీలోకి ప్రవేశించాయని ఆయన ఆరోపించారు. పార్టీ నుంచి నేతలు నిష్క్రమణపై కమల్ స్పందిస్తూ.. ‘‘ద్రోహులను తొలగించాలని పార్టీ ఏకగ్రీవంగా తీర్మానించింది... డాక్టర్ మహేంద్రన్ ఆ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు’’ వ్యాఖ్యానించారు.

Related Posts