YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

ఒకే దేశం...అన్నీ అవమనాలే

ఒకే దేశం...అన్నీ అవమనాలే

కోల్కత్తా, మే 20, 
ప్రధాని నరేంద్ర మోదీపై బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి విరుచుకుపడ్డారు. కరోనా కట్టడి విషయమై ఇటీవల జరిగిన సమావేశంలో సమాఖ్య వ్యవస్థను విస్మరించి రాష్ట్రాల ముఖ్యమంత్రులను అవమానించారని మమతా బెనర్జీ దుయ్యబట్టారు. అంతేకాదు, కరోనా కట్టడిపై ఎటువంటి ఆర్ధిక సాయం ప్రకటించడం లేదా ముఖ్యమంత్రులకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదని దీదీ ఆరోపించారు. ‘‘ఇది వన్ వే కమ్యూనికేషన్ కాదు.. ఇది ఏకపక్ష అవమానం.. ఒక దేశం.. అంతా అవమానాలు’’ అంటూ మమతా విరుచుకుపడ్డారు. దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి, కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు గతేడాది నుంచి ప్రధాని ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సమావేశాలకు కొన్నిసార్లు బెంగాల్ సీఎం మమతా గైర్హజరయ్యారు. ‘‘చాలా అభద్రతభావానికి గురవుతున్న ప్రధాని.. సీఎంలు చెప్పే విషయాలను వినడం లేదు? ఆయనకు ఎందుకంత భయం? ముఖ్యమంత్రులు చెప్పేది వినకపోతే సమావేశం ఎందుకు పెట్టాలి? కొంత మంది జిల్లా కలెక్టర్లను మాట్లాడటానికి అనుమతించి సీఎంలను అవమానించారు’’ అని విమర్శించారు.‘‘ప్రధాని మోదీకి మామూలుగా అహంకారమని ఆరోపించిన మమత.. చాలా రాష్ట్రాల తరఫున సీఎంలు ప్రతినిధులు పాల్గొంటే ఒక్కరికీ మాట్లాడే అవకాశం ఇవ్వలేదు.. ఆయన ఏం మనకుంటున్నారు? మేము వెట్టిచాకిరీ కూలీలమా లేదా తోలు బొమ్మలమా? సమాఖ్య నిర్మాణానికి తూట్లు పొడుస్తున్నారు’’ అని విరుచుకుపడ్డారు.ఏ ముఖ్యమంత్రికి మాట్లాడే అవకాశం ఇవ్వలేదు.. కేవలం జిల్లా మేజిస్ట్రేట్లను మాట్లాడమన్నారు.. యూపీ, చత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక్కొక్కరు మాట్లాడారు.. నేను సీఎంల అందరి తరఫున మాట్లాడటం లేదు.. కానీ, ఏం జరుగుతోంది.. మార్షల్ లా మాదిరిగా నియంతృత్వం కొనసాగుతోంది’’ అని మమతా బెనర్జీ తీవ్రస్థాయిలో మోదీపై ధ్వజమెత్తారు.బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలు ముగిసినా బీజేపీ, అధికార తృణమూల్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. నారదా టేపుల కుంభకోణం కేసులు ఇద్దరు బెంగాల్ మంత్రులు, ఓ ఎమ్మెల్యేను సీబీఐ అరెస్ట్ చేయడం పట్ల కేంద్రంపై మమతా బెనర్జీ ఆరోపణలు గుప్పించారు. రాష్ట్రంలో మోదీ భయానకం సృష్టిస్తున్నారని దీదీ ఆరోపించారు.మావేశంలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని.. తమతో మాట్లాడలేదని.. దీనిని తాము అవమానంగా భావిస్తున్నామన్నారు మమత.అనంతరం దీదీ మాట్లాడుతూ.. ‘‘ప్రధాని ముఖ్యమంత్రులను సమావేశానికి ఆహ్వానించారు.. కానీ మాతో మాట్లాడలేదు.. మాకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. కేవలం కొందరు బీజేపీ ముఖ్యమంత్రులు, ప్రధాని చిన్న చిన్న ప్రసంగాలు చేశారు. సమావేశం ముగిసింది అన్నారు. ఇది చాలా సాధారణ సమావేశంగా అనిపించింది’’ అన్నారు.ప్రధాని ప్రవర్తించిన తీరు మమ్మల్ని అవమానించినట్లుగా అనిపించింది. ఆయన టీకాల గురించి కానీ, రెమ్‌డెసివర్‌, బ్లాక్‌ ఫంగస్‌ కేసుల గురించి మాట్లాడలేదు. వ్యాక్సిన్‌ల కోసం డిమాండ్‌ చేయాలని భావించాం. కానీ మాకు మాట్లాడే అవకాశమే రాలేదు. గతంలో మాదిరిగానే ప్రధాని ఈ సారి కూడా కేసులు తగ్గుతున్నాయన్నారు. ఆయన చాలా అభద్రతాభావంతో ఉన్నారు. మేం చెప్పేది వినలేదు’’ అంటూ దీదీ మండిపడ్డారుపశ్చిమ బెంగాల్‌తో సహా మరో ఎనిమిది ఈశాన్య రాష్ట్రాల్లో రోజువారీ కోవిడ్ కేసుల సంఖ్య, మరణాలు పెరుగుతున్నాయి. పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన తెలిపింది. పశ్చిమ బెంగాల్ లోని అన్ని జిల్లాలు పాజిటివిటీ రేటు బాగా పెరిగింది. కోల్‌కతా, ఉత్తర 24 పరగణాలు, దక్షిణ 24 పరగణాలు, హౌరా, నాడియాలను ఆందోళన జిల్లాలుగా గుర్తించినట్లు కేంద్రం తెలిపింది.

Related Posts