YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం విద్య-ఉపాధి తెలంగాణ

ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు త్వరలోనే నోటిఫికేషన్‌... టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ జనార్దన్‌రెడ్డి

ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు త్వరలోనే నోటిఫికేషన్‌... టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ జనార్దన్‌రెడ్డి

హైదరాబాద్ మే 20
ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు త్వరలోనే నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ జనార్దన్‌రెడ్డి ప్రకటించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా నియామకాలు చేపడుతామని తెలిపారు. ఉద్యోగాల నియామకంలో పారదర్శకంగా ఉంటామని స్పష్టం చేశారు. నిరుద్యోగులు అధైర్యపడొద్దని జనార్దన్‌రెడ్డి సూచించారు. గతంలో వివిధ జిల్లాల కలెక్టర్‌గా, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా.. ప్రజల సమస్యలను దగ్గరగా చూశామని జనార్దన్‌రెడ్డి చెప్పారు. తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ)కు పూర్తిస్థాయి చైర్మన్‌తో పాటు సభ్యులను ప్రభుత్వం ఎట్టకేలకు నియమించింది. చైర్మన్‌గా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి, వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి డాక్టర్‌ బి.జనార్దన్‌రెడ్డి నియమితులయ్యారు. చైర్మన్‌తో పాటు ఏడుగురు సభ్యులను సీఎం కేసీఆర్‌ బుధవారం నియమించారు. సీఎం  ప్రతిపాదనలను గవర్నర్‌ తమిళిసై ఆమోదించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) సోమేశ్‌ కుమార్‌.. చైర్మన్‌, సభ్యుల నియామకానికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేశారు. చైర్మన్‌తో పాటు సభ్యులంతా ఆరేళ్లు లేదా 62 ఏళ్ల వయసు వచ్చే వరకు పదవిలో కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Related Posts