YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ప్రగతి భవన్ లో మంత్రులకే ఎంట్రీ కష్టమా

 ప్రగతి భవన్ లో మంత్రులకే ఎంట్రీ కష్టమా

హైదరాబాద్, మే 21, 
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు రాజకీయ అనుభవం ఉండవచ్చు. మంచి వ్యూహాలే తెలిసి ఉండవచ్చు. కానీ రాజకీయాల్లో అన్ని సమయాలు ఒకలా ఉండవు. కేసీఆర్ తీరు మార్చుకోకుంటే ఎప్పటికైనా ఆయనకు ఇబ్బందులు తప్పవు. ఏడేళ్లలో కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను అమలు చేసి ఉండవచ్చు. కోట ఎకరాలకు నీరు అందించి ఉండవచ్చు. ఉద్యోగాల భర్తీ చేసి ఉండవచ్చు. బంగారు తెలంగాణగా మార్చి ఉండవచ్చు. కానీ తాను మారకపోతే జనం మార్చేస్తారన్న విషయాన్ని కేసీఆర్ గుర్తుంచుకుంటే మంచిదన్న కామెంట్స్ వినపడుతున్నాయి.కేసీఆర్ గత ఏడేళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్నారు. కనీసం ప్రగతి భవన్ దాటి రాలేదు. సచివాలయం అనేది ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఎరుగరు. గతంలో ఎందరో ముఖ్యమంత్రులు సచివాలయానికి వచ్చి పరిపాలన చేసేవారు. అధికారులు సమయపాలన పాటించేవారు. ముఖ్యమంత్రి వస్తున్నారంటే అధికారులు వస్తారని, సిబ్బంది కూడా సహజంగానే ముందు వచ్చే వారు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. రాజుకు తగ్గట్లుగానే…. అన్నట్లు ఉంది.ఇక ఎమ్మెల్యేలు, మంత్రులను కేసీఆర్ కలవరన్నది ఎప్పటి నుంచో జరుగుతున్న ప్రచారం. ఆయన వద్దకు వెళ్లాలంటే మంత్రులకే అనుమతి దొరకదని ఈటల రాజేందర్ వంటి బర్త్ రఫ్ కాబడిన మంత్రులు చెబుతున్నా దానిని కొట్టపారేయలేం. ఎందుకంటే ప్రగతి భవన్ లోకి వెళ్లాలంటే మంత్రులకే కష్టమయితే ఇక సామాన్య ప్రజల సంగతేంటి? అన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది. ముఖ్యమంత్రి నేరుగా ప్రజలను కలవకపోయినా వారి సమస్యలను పరిష్కరించేందుకు తగిన మార్గాన్ని చూపాలి.కానీ కేసీఆర్ గత ఏడేళ్లలో ప్రజలను నేరుగా కలిసింది లేదు. ఇప్పుడంటే కరోనా కాని గతంలో కూడా కేసీఆర్ ప్రజలను కలవడం చాలా తక్కువ. ఏదైనా ఉంటే వారినే ప్రగతి భవన్ కు రప్పించుకుంటారు. ఇక ఎన్నికలంటునే బహిరంగ సభల ద్వారా ప్రజల ముందుకు వెళతారు. ఇక ఎమ్మెల్యేలు నేరుగా ముఖ్యమంత్రి దృష్టికి తమ నియోజకవర్గ సమస్యలను తీసుకెళ్లాలన్నా కష్టమే. అసెంబ్లీ సమావేశాల్లోనో, బహిరంగ సభల్లోనూ ఎమ్మెల్యేలు వినతి పత్రాలు ఆయనకు ఇస్తుండటం విశేషం. ప్రజలకు దూరంగా ఉండే కేసీఆర్ ఇకనైనా ప్రగతి భవన్ ను వీడాలంటున్నారు. లేకుంటే ప్రజలే ఆయన్ను మార్చే అవకాశాలు లేవని మాత్రం చెప్పలేం.

Related Posts