ఆనందయ్య ఆయుర్వేద మందుకి ఎం.ఎల్.ఏ కాకాని గోవర్ధన్ రెడ్డి పూర్తి సహకారం..
* ఐ. సి.ఎం.ఆర్ నివేదిక కోరిన ముఖ్యమంత్రి జగన్.
దొంగతనం జరిగిందనో, రేప్ జరిగిందనో, మర్డర్ జరిగిందనో మరేదైనా అన్యాయం జరిగిందని సాక్షాలతో పిర్యాదు చేసినా పట్టించుకునే నాధుడుండడు...అదే ఓ పది మందికి ఒక మంచి పని జరుగుతుంటే ,పోయే ప్రాణాలు పైసా ఖర్చు లేకుండా తిరిగొస్తున్నాయంటే మాత్రం అడ్డుకుంటున్నారు. అమ్మ పెట్టాపెట్టదు అడుక్కుని తినానివ్వదన్నట్లు ఉంది .అనేక అనుమానాయలు, అవరోధాలు, అడ్డంకులు మన రాజకీయాల్ని శాసించే దిక్కుమాలిన క్యాప్టలిస్టుల వ్యవస్థ...కృషపట్నం ఆనందయ్య ఆయుర్వేద వైద్యానికి అందరూ బ్రతుకుతుం టే , ఈ వైద్యం వికటించిందని ఒక్క పిర్యాదు లేనప్పుడు ఈ అవరోధాలెందుకు..లక్షలు కోట్లు ఖర్చు పెట్టినా దక్కని ప్రాణాలు, ఒకరి తరువాత ఒకరు ఇలా కుటుంబాలకు కుటుంబాలే ప్రాణాలు కోల్పోయి పండండి సాంసారాలు స్మశానాల్లా మారుతున్నాయి. ఇంకా ఈ రోగానికి ఖచ్చితమైన చికిత్స విధానంగాని మందులు కానీ చెప్పే స్థితిలో వైద్య రంగం గానీ ప్రభుత్వ ఆరోగ్యం శాఖ లేదు. ఈ పరిస్థితుల్లో కృష్ణపట్నం ఆనందయ్య లాంటి నిస్వార్థ ఆయుర్వేద వైద్యుడు చేస్తున్న ఈ సేవను స్వాగతి ద్దాం , కరోనా దాటికి కొన ఊపిరితే కొట్టుకునే ప్రాణాల్ని కాపాడుకుందాం..ప్రస్తుతం దేశం మన రాష్ట్రాలు ఉన్న ఈ విషమ పరిస్థితుల్లో ఇది సహేతుకమైందా, శాస్త్రీయ బద్దమైందా అన్న చర్చ అనవసరం. దేశం మొత్తం కరోనా కాటుకు మానవ జాతి పిట్టల్లా రాలిపోతూ, చితి పేర్చడానికి జాగా లేని దుస్థితిలో శవాల గుట్టలు గుట్టలు గా పేరుకు పోతుంటే, ఆగిపోతున్న శ్వాసకు ఓ ఆశ ఈ ఆనందయ్య.. ఆదరిద్దాం అందర్నీ బ్రతికించే వైద్యానికి మద్దతిద్దాం....చితికి చేరుతున్న బ్రతుకులకు చిరు దీపమై తన చేతనైన సాయం సాటి మనిషిని కాపాదాలనే నిస్వార్థ సంకల్పం తో ఆనందయ్య చేస్తున్న ఈ మహత్తర కార్యానికి మన వంతు మద్దతిద్దాం..అడ్డుకునే అసాంఘిక శక్తుల్ని అరికడడం..
వ్యాపారం కన్నా వ్యక్తి జీవితమే ముఖ్యం. రోగి ప్రాణాలతో చెలగాటం ఆడే బడా వ్యాపార వ్యవస్థ కు చెక్ పెట్టె సమయం ఆసన్నమైంది.ప్రజలందరికీ సత్వరము వ్యాక్సిన్ అందించే దిశలో లేదు ప్రభుత్వం లేదు కారణం వ్యాక్సిన్ కొరత , గ్లోబల్ టెండర్లు పిలిచారు..అది ఫైనలైజ్ అయ్యి ప్రజలందరికీ చేరే లోపు కరోనా పూర్తిగా కమ్మేసి ఇంకెంత మంది ప్రాణాలు గాలిలో కల్సి పోతాయో..కృష్ణ పట్నం ఆనందయ్య ఆయుర్వేద మందు పట్ల రోగులెవ్వరూ వ్యతిరేకంగా పిర్యాదు చేయనప్పుడు ఇకనైనా ప్రభుత్వం ప్రజా క్షేమం కోరి ఆనందయ్య కు పూర్తి సహాయ సహకారాలు అందించి ప్రతి ఒక్కరికీ ఈ మందు పంపిణీ జరిగేలా చూడాలి. ఇప్పటికే ఆయన ఇచ్చే మందు పట్ల కోటి ఆశలు పెట్టుకున్న రోగులు వేల సంఖ్యలో అనేక సుదూర ప్రాంతాలనుండి కృష పట్నం తరలి వెళుతున్నారు. ఈ రద్దీ వల్ల వైరస్ మరింత విస్తరిస్తుందని అనుమానిస్తున్న అధికారులు ఓ విషయం గుర్తించాలి పాజిటీవ్ వచ్చిన వ్యక్తి ఈ మందు తీసుకున్న రెండూ రోజుల్లో నెగిటీవ్ రిపోర్ట్ వస్తు న్నప్పుడు ,అక్కడికి వచ్చిన వారంతా మందు వేసుకోవడం వల్ల ఎలా విస్తరిస్తుంది..ఎంత మంది వస్తే అంత మంది ఈ మందు తీసివెళుతున్నప్పుడు వ్యాప్తి జరిగినా పెద్ద ప్రమాదమేమీ సంభవించదు. ఇప్పుడే ఆ రాష్ట్రా ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి ఐ.సి.ఎం.ఆర్ బృందాన్ని కృష్ణ పట్నం వెళ్లి ఆనందయ్య ఇచ్చే మందు ని పూర్తిగా అధ్యయనం చేసి వెంటనే నివేదిక ఇవ్వాలని ఆదేశించారని ఎం.ఎల్.ఏ కాకాని గోవర్ధన్ రెడ్డి తెలియ చేశారు.ఐ. సి.ఎమ్మార్ ఇచ్చే నివేది ప్రకారం వెంటనే తగిన రీతిలో ఈ మందు పంపిణీ చేస్తామని ,అప్పటి వరకూ ప్రజలెవ్వరూ ఇక్కడికి రావద్దని కోరారు.
Courtesy: సురేష్ కశ్యప్