హైదరాబాద్ మే 21
ఆదర్శ పాఠశాలల ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువును ప్రభుత్వం మరోసారి పొడిగించింది. వచ్చే 20 వరకు దరఖాస్తు గడువును పొడిగిస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆరో తరగతిలో ప్రవేశాలకు, 7వ తరగతి నుంచి 10 వరకు ఖాళీగా ఉన్న సీట్లకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు.ఆసక్తి గల విదార్థులు http ://telanganams.cgg.gov.in వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలతో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. దరఖాస్తు గడువు పొడిగించిన నేపథ్యంలో ప్రవేశ పరీక్ష నిర్వహణ తేదీలు సైతం మారనున్నాయి. పరీక్షల తేదీలను త్వరలో ప్రకటిస్తామని ఆదర్శ పాఠశాలల ప్రాజెక్టు డైరెక్టర్ వెల్లడించారు. అంతకుముందు వచ్చే నెల 5, 6వ తేదీల్లో ప్రవేశ పరీక్షలు ఉంటాయని అధికారులు ప్రకటించిన విషయం తెలిసిందే.