గోవా మే 21,
తెహల్కా మాజీ ఎడిటర్ ఇన్ చీఫ్ తరుణ్ తేజ్‌పాల్‌కు అత్యాచారం కేసులో ఎట్టకేలకు విముక్తి లభించింది. అత్యాచారం, లైంగికదాడి ఆరోపణల కేసులో తరుణ్ తేజ్‌పాల్‌ను గోవా కోర్టు నిర్దోషిగా తేల్చింది. నెల 19నే ఈ కేసుపై తీర్పు వెలువడాల్సి ఉంది. అయితే రెండు, మూడు రోజులుగా విద్యుత్ లేకపోవడంతో తీర్పును జడ్జి వాయిదా వేశారు.2013లో జరిగిన థింక్ ఇన్ గోవా సమావేశంలో తరుణ్ తేజ్‌పాల్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాటంటూ తెహల్కా.కామ్‌కే చెందిన ఓ మహిళా జర్నలిస్టు అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు తరుణ్ తేజ్‌పాల్‌పై కేసు నమోదు చేసిన గోవా పోలీసులు 2013 నవంబర్ 30న ఆయనను అరెస్ట్ చేశారు. గోవా కోర్టు ఈ కేసు విచారణ చేపట్టింది. అయితే, తనపై తప్పుడు ఆరోపణలు చేశారని, ఆ ఆరోపణలను కొట్టివేయాలని తేజ్‌పాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అదేవిధంగా బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేశారు.