YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

నెట్టింట్లో హల్ చల్ చేస్తున్న సితార

నెట్టింట్లో హల్ చల్ చేస్తున్న సితార

టాలీవుడ్ సూపర్ స్టార్ నటించిన తాజా చిత్రం ‘భరత్‌ అనే నేను’. ఇటీవల విడుదలైన ఈ చిత్రం భారీ కలెక్షనతో విజయవంతంగా దూసుకెళ్తోంది. మరోవైపు ఈ సినిమాకు సంబంధించిన ప్రచార కార్యక్రమాలు కూడా జోరుగా కొనసాగుతున్నాయి. ఇటీవల విజయవాడ వెళ్లి కనకదుర్గమ్మను దర్శించుకున్న మహేశ్‌ బాబు అభిమానులతో కలిసి ‘భరత్ అనే నేను’ చిత్రాన్ని వీక్షించారు కూడా. మరోవైపు తండ్రికి తగ్గ తనయలా మహేశ్‌ గారాలపట్టి సితార కూడా నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది. సితారకు సోషల్‌మీడియాలో మంచి ఫాలోయింగ్‌ ఉంది.కొన్నిరోజుల నుంచి మహేశ్, నమత్రా, సితార కలిసి ఉన్న ఓ ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ఫొటో.. భరత్‌ అనే నేను సినిమాలోని అసెంబ్లీ సెట్‌‌లా కనిపిస్తోంది. ఈ సినిమాలోని ఓ పాటను కూడా సితార చక్కగా పాడుతూ అందరిని అబ్బురపరుస్తోంది. సితార.. ‘ఇది కలలా వున్నదే...’ అనే పాట పాడుతున్న వీడియో కూడా సోషల్ మీడియాలో సందండి చేస్తోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు, మహేశ్ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.

Related Posts