అమరావతి, కృష్ణపట్నంలో కరోనాకి ఆనందయ్య ఆయుర్వేద మందు అనుమతి పై జగన్ సమీక్ష శాస్త్రీయత, పనిచేసే విధానాన్ని తెలుసుకోనున్న జగన్ మందుపై ఏపీ వైద్య ఆరోగ్య శాఖ క్షేత్రస్థాయిలో పరిశీలన.
ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణపట్నంలో కరోనాకి ఆనందయ్య ఆయుర్వేద మందు అందిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఈ ఆయుర్వేద మందు పంపిణీకి అనుమతి ఇవ్వాలా? వద్దా? అన్న అంశంపై సీఎం జగన్ సమీక్షిస్తున్నారు ఆయుర్వేద మందు శాస్త్రీయత, పనిచేసే విధానాన్ని తెలుసుకున్నారు. అధికారుల బృందం చేసిన పరిశోధన, నివేదికపై చర్చ జరుగుతోంది. ఒకవేళ పంపిణీకి అనుమతి ఇస్తే ప్రభుత్వ పరంగా చేయాల్సిన ఏర్పాట్లపై కాసేపట్లో కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. కృష్ణపట్నంలో కరోనాకి ఆనందయ్య ఆయుర్వేద మందు అందిస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో జనం వస్తుండడంతో అక్కడ తీవ్ర గందరగోళం నెలకొంది. దీంతో మందు పంపిణీని తాత్కాలికంగా అపేశారు. మరోవైపు ఆనందయ్య పంపిణీ చేసే మందుపై ఏపీ వైద్య ఆరోగ్య శాఖ రంగంలోకి దిగి క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తోంది. మందు పనిచేసే విధానంపై వివరాలు తీసుకుంటోంది. ఔషధం శాస్త్రీయంగా నిరూపణ కావాల్సి ఉందని తెలిపింది. అంతేగాక, చికిత్స అనంతరం పరిణామాలపై అధ్యయనం చేయాలని నివేదిక రూపొందించింది. నెల్లూరు కి ఐసీఎంఆర్ బృందాన్ని పంపి కరోనా కి ఇస్తున్న ఆయుర్వేద మందు పై అధ్యయనం చేస్తారు. ఆనందయ్య కరోనా మందు పై అధ్యయనానికి సీఎం జగన్ నిర్ణయం తీసుకోవడంతో, సీఎం జగన్ ఆదేశాలతో నెల్లూరుకు ఐసీఎంఆర్ బృందం బయలుదేరింది. ఈ రోజు సాయంత్రానికి ఐసీఎంఆర్ బృందం నెల్లూరు వెళ్లే అవకాశం ఉందని ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని వెల్లడించారు.కరోనా నాటు మందు తయారీదారుడు ఆనందయ్య,సర్వేపల్లి ఎమ్మ్యేల్ల్యే కాకాణి గోవర్దన్ రెడ్డి వెంట మీడియా సమావేశంలో పాల్గొన్నారు.