YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కరోనా రోగులకు ధైర్యం చెప్పిన కేసీఆర్

కరోనా రోగులకు ధైర్యం చెప్పిన కేసీఆర్

వరంగల్. మే 21, 
కరోనా పేషంట్ వెంకటాచారి తనకు వైద్య చికిత్స బాగానే అందుతున్నదని సీఎంకు వివరించారు. కేసీఆర్ జిందాబాద్.. కేసీఆరే నా నిండు ప్రాణం అని ఆయన అన్నారు.ప్రతీ బెడ్ దగ్గరకూ వెళ్లి కరోనా రోగులకు అందుతున్న వైద్య సేవలను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. అనంతరం సీఎం కేసీఆర్ జనరల్ వార్డును సందర్శించి రోగులను పరామర్శించారు. ఎంజీఎం ఆస్పత్రి అంతా కలియతిరిగి అక్కడి సౌకర్యాలను పరిశీలించారు. ఎంజీఎం ఆస్పత్రిలో ఉన్న వైద్య సౌకర్యాలు, రోగులకు అందుతున్న వైద్య సేవలపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో సిబ్బందికి ఎదురవుతున్న ఇబ్బందులను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. ఎంత ఖర్చయినా సరే.. రోగులకు కావాలసిన అన్ని సౌకర్యాలను సమకూర్చాలని అక్కడే ఉన్న వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.వరంగల్ పర్యటనలో భాగంగా శుక్రవారం మధ్యాహ్నం 12.45 గంటలకు ఎంజీఎం దవాఖానకు చేరుకున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నేరుగా కోవిడ్ పేషంట్లు ఉన్న ఐసీయూ వార్డులోకి వెళ్లి రోగులను పరామర్శించారు. కోవిడ్ పేషంట్లకు అందుతున్న చికిత్స గురించి తెలుసుకున్నారు. కరోనాకు భయపడవద్దంటూ వారికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా వరంగల్ మట్టెవాడకు చెందిన కరోనా పేషంట్ వెంకటాచారి తనకు వైద్య చికిత్స బాగానే అందుతున్నదని సీఎంకు వివరించారు. కేసీఆర్ జిందాబాద్.. కేసీఆరే నా నిండు ప్రాణం అంటూ ఆయన అన్నారు. ప్రతి పడక వద్దకూ వెళ్లి కరోనా రోగులకు అందుతున్న వైద్య సేవలను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు.అనంతరం సీఎం కేసీఆర్ జనరల్ వార్డును సందర్శించి రోగులను పరామర్శించారు. ఎంజీఎం ఆస్పత్రి అంతా కలియతిరిగి అక్కడి సౌకర్యాలను పరిశీలించారు. ఎంజీఎం ఆస్పత్రిలో ఉన్న వైద్య సౌకర్యాలు, రోగులకు అందుతున్న వైద్య సేవలపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో సిబ్బందికి ఎదురవుతున్న ఇబ్బందులను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. ఎంత ఖర్చయినా సరే.. రోగులకు కావాలసిన అన్ని సౌకర్యాలను సమకూర్చాలని అక్కడే ఉన్న వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.ఈ పర్యటనలో సీఎం కేసీఆర్ వెంట మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్, మేయర్ గుండు సుధారాణి, సిఎస్ సోమేశ్ కుమార్, రిజ్వి, డీఎం ఈ రమేష్ రెడ్డి, ఓఎస్డీ గంగాధర్, ఎంజీఎం సూపరింటెండెంట్ చంద్ర శేఖర్, హెల్త్ డిపార్ట్‌మెంట్ ఉన్నతాధికారులు, సీపీ తరుణ్ జోషి, జిల్లాకు చెందిన పలువురు నాయకులు ఉన్నారు
అధికారులతో సమీక్ష
జిల్లాల్లో క‌రోనా ప‌రిస్థితుల‌పై రాష్ట్ర ముఖ్య‌మంత్రి కె.చంద్ర‌శేఖ‌ర్ రావు స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించారు. వ‌రంగ‌ల్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న సీఎం వ‌రంగ‌ల్ అర్బ‌న్ క‌లెక్ట‌రేట్ నుంచి అన్ని జిల్లాల క‌లెక్ట‌ర్లు, ఎస్పీలు, డీఐజీల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. అంత‌కుక్రితం సీఎం ఎంజీఎం ఆస్ప‌త్రిని సంద‌ర్శించారు. కొవిడ్ రోగుల‌తో మాట్లాడి ఆరోగ్య పరిస్థితులు, అందుతున్న చికిత్స‌ల గురించి వాక‌బు చేసి వారిలో భ‌రోసా నింపారు. అనంత‌రం వ‌రంగ‌ల్ కేంద్ర కారాగారాన్ని సీఎం సంద‌ర్శించారు. అక్క‌డి ఖైదీల‌తో మాట్లాడి యోగ‌క్షేమాల‌ను క‌నుక్కున్నారు. ఖైదీలు త‌యారు చేసిన ఉత్ప‌త్తుల‌ను సీఎం ప‌రిశీలించారు.
సెంట్రల్ జైలు సందర్శన
వ‌రంగ‌ల్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న రాష్ట్ర ముఖ్య‌మంత్రి కె.చంద్ర‌శేఖ‌ర్ రావు వ‌రంగ‌ల్ సెంట్ర‌ల్ జైలును సంద‌ర్శించారు. జైలులోని ఖైదీల‌ను ప‌రామ‌ర్శించి వారి నేర కార‌ణాల‌ను విచారించారు. జైలులో వారికి అందుతున్న సౌక‌ర్యాల‌ను అడిగి తెలుసుకున్నారు. అనంత‌రం ఖైదీలు త‌యారు చేసిన ప‌లు ర‌కాల చేనేత ఉత్ప‌త్తులు, ఇత‌ర వ‌స్తువుల‌ను సీఎం ప‌రిశీలించారు. అంత‌కుక్రితం ఎంజీఎం ఆస్ప‌త్రిని సంద‌ర్శించిన సీఎం అక్క‌డి కొవిడ్ రోగులను ప‌రామ‌ర్శించారు. వారి ఆరోగ్య వివ‌రాల‌ను, అందుతున్న సేవ‌ల‌ను గురించి అడిగి తెలుసుకున్నారు. ఎవ‌రూ అధైర్య‌ప‌డొద్ద‌ని భ‌రోసా క‌ల్పించారు

Related Posts