YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు ఆంధ్ర ప్రదేశ్

రఘురామరాజుపై దాడి నిజమే

రఘురామరాజుపై దాడి నిజమే

న్యూఢిల్లీ, మే 21, 
నరసాపురం పార్లమెంట్ సభ్యుడు రఘురామకృష్ణరాజును సీఐడీ అధికారులు కస్టడీలో చిత్రహింసలకు గురిచేసినట్టు ముగ్గురు వైద్యుల నివేదిక పేర్కొంది. వైద్య పరీక్షల నివేదికపై శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి జస్టిస్ వినీత్ శరన్.. ఆర్మీ ఆస్పత్రి వైద్య నివేదిక అందినట్టు తెలిపారు. ముగ్గురు వైద్యులు పరీక్షించి ఎక్స్-రే, వీడియో పంపారని అన్నారు. జనరల్ ఎడిమాతోపాటు గాయాలున్నట్టు నివేదికలో పేర్కొన్నారని జస్టిస్ శరన్ వివరించారు. రఘురామ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్గీ, ఆదినారాయణ రావు వాదనలు వినిపించారు. కస్టడీలో ఎంపీని చిత్రహింసలకు గురిచేసిన విషయం నిజమేనని తేలిందని ముకుల్ రోహిత్గీ వ్యాఖ్యానించారు. దీనిపై సీబీఐతో విచారణ జరిపించాలని ఆయన కోరారు. సిట్టింగ్ ఎంపీకే ఇలా జరిగితే సాధారణ ప్రజల పరిస్థితేంటని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన దుష్యంత్ దవే.. ఆయన స్వయంగా చేసుకున్నావా? కాదా అనేది తెలియాల్సి ఉందన్నారు. ఈ సందర్భంగా స్పందించిన ధర్మాసనం.. ఆస్పత్రికి తీసుకెళ్లే ముందు ఎంపీ స్వయంగా గాయాలు చేసుకుంటున్నారా? అని ప్రశ్నించింది. ఈ సమయంలో కేసును సోమవారానికి వాయిదా వేయాలన్న ప్రభుత్వం తరఫున న్యాయవాది అభ్యర్థను ధర్మాసనం తిరస్కరించింది. వైద్య పరీక్షల నివేదికను ఏపీ ప్రభుత్వం, న్యాయవాదులకు మెయిల్ చేస్తామని తెలిపింది. తదుపరి విచారణ శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటకు వాయిదా వేసిన ధర్మాసం.. అప్పుడే వాదనలు వింటామని స్పష్టం చేసింది. సీనియర్ అడ్వైజర్, కార్డియాలజిస్ట్ కల్నల్ సంజీవ్ సేన్ గుప్తా నేతృత్వంలోని బృందం ఎంపీ రఘురామకు వైద్య పరీక్షలను నిర్వహించింది. మధ్యాహ్నం 12 గంటలప్రాంతంలో జస్టిస్‌ వినీత్‌ శరణ్‌, జస్టిస్‌ బి.ఆర్‌. గవాయిలతో కూడిన ధర్మాసనం 25 నంబర్‌ ఐటమ్‌‌గా ఈ కేసు విచారణకు వచ్చింది. రాజద్రోహం, తదితర కేసులను మోపి సీఐడీ అరెస్టు చేసిన రఘురామకృష్ణ రాజుకు సికింద్రాబాద్‌ ఆర్మీ ఆస్పత్రిలో వైద్యపరీక్షలు చేసి తమకు నివేదిక సమర్పించాలని సుప్రీంకోర్టు మే 17న ఆదేశించిన విషయం తెలిసిందే. వైద్యపరీక్షలకు సంబంధించి ఆర్మీ ఆస్పత్రి వైద్యులు రూపొందించిన నివేదిక... తెలంగాణ హైకోర్టు ద్వారా గురువారం సుప్రీంకోర్టుకు చేరింది. తనకు బెయిల్‌ మంజూరు చేయాలంటూ రఘురామకృష్ణరాజు వేసిన ఎస్‌ఎల్‌పీకి (స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌) కౌంటర్‌‌గా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌ కూడా కోర్టు పరిశీలనలో ఉంది. మొత్తం ఉదంతంలో వైద్య పరీక్షల నివేదిక, ఆయనపై మోపిన సెక్షన్లు కీలక పాత్ర పోషించనున్నాయని న్యాయనిపుణులు అంటున్నారు.

Related Posts