YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

ఎమ్మెల్యేలకు గృహ నిర్భంధం

ఎమ్మెల్యేలకు గృహ నిర్భంధం

కోల్ కత్తా, మే 21, 
నారద టేపుల కేసుకు సంబంధించి ఇద్దరుబెంగాల్ మంత్రులు, తృణమూల్ ఎమ్మెల్యే, బీజేపీ మాజీ నేత మొత్తం నలుగుర్ని సీబీఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇద్దరు మంత్రులకు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం బెయిల్ మంజూరు చేయగా.. కలకత్తా హైకోర్టు దీనిపై స్టే విధించింది. తదుపరి ఆదేశాలు వచ్చేవరకూ ఇది అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. తాజాగా, వీరికి గృహ నిర్బంధం విధిస్తూ కలకత్తా హైకోర్టు శుక్రవారం ఉదయం నిర్ణయం వెలువరించింది.అరెస్టయిన నేతల బెయిల్ పిటిషన్‌పై డివిజన్ బెంచ్‌లోని ఇద్దరు న్యాయమూర్తలు భిన్నాభిప్రాయం వ్యక్తం చేయడంతో ముగ్గురు సభ్యుల ధర్మాసనానికి సిఫార్సు చేసింది. ద్విసభ్య ధర్మాసనంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాజేశ్ బిందాల్.. గృహ నిర్బంధం ఆదేశాలు జారీచేశారు. కానీ, మరో న్యాయమూర్తి జస్టిస్ అర్జిత్ బెనర్జీ మధ్యంతర బెయిల్‌ను ఇవ్వాలని సూచించారు. అయితే, గృహ నిర్బంధాన్ని సీబీఐ వ్యతిరేకించింది. దీనిపై స్టే ఇవ్వాలని కోరింది. కరోనా వైరస్ నేపథ్యంలో గృహ నిర్బంధం విధించినట్టు కోర్టు తెలిపింది.అయితే, ఈ నిర్ణయాన్ని సీబీఐ, టీఎంసీ వ్యతిరేకించాయి. సీబీఐ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా హాజరయ్యారు. మంత్రులు తరఫున సీనియర్ న్యాయవాదులు అభిషేక్ మను సింఘ్వీ, సిద్ధార్థ్ లూత్రాలను వాదనలు వినించింది. త్రిసభ్య ధర్మాసనాన్ని వీలైనంత తొందరగా లేదంటే ఈ రోజే ఏర్పాటు చేయాలని అభ్యర్థించారు.గృహ నిర్బంధానికి, అరెస్ట్‌కు ఎటువంటి వ్యత్యాసం లేదని, వారికి బెయిల్ ఇవ్వాలని అభిషేక్ మను సింఘ్వీ కోరారు. తాత్కాలిక పరిస్థితి స్వేచ్ఛగా ఉండాలి.. మంత్రులు, ఎమ్మెల్యేలైన వీళ్లు దర్యాప్తుకు సహకరించడం లేదని స్వల్ప ఆరోపణలు కూడా లేవని వాదించారు.కాగా, మంత్రులు ఫిర్హాద్ హకీమ్,సుబత్రా ముఖర్జీ, ఎమ్మెల్యే మదన్ మిత్రాలను అరెస్ట్ చేయడంపై సీఎం మమతా బెనర్జీ అగ్గిమీద గుగ్గిలమయ్యారు. ఆమె నేరుగా సీబీఐ కార్యాలయానికి చేరుకుని నిబంధనలు పాటించకుండా ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించారు. తనను కూడా అరెస్ట్ చేయాలని సీబీఐకి సవాల్ విసిరారు. నేతల కుటుంబసభ్యులు, పెద్ద ఎత్తున టీఎంసీ నేతలు కూడా చేరుకుని ఆందోళన నిర్వహించారు.మదన్ మిత్రా మాట్లాడుతూ.. ‘‘మేము తప్పుడు మనుషులమే.. కానీ, ముకుల్ రాయ్, సువేందు అధికారి’’ సంగతేంటని మిత్రా ప్రశ్నించారు. ఈ కేసులో వారిద్దరూ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. నారద స్టింగ్ ఆపరేషన్ చేపట్టిన సమయంలో వీరు మమతా క్యాబినెట్‌లో మంత్రులే. ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. టీఎంసీ నుంచి బీజేపీలో చేరి తర్వాత ఆ పార్టీకి రాజీనామా చేసిన సోవన్ ఛటర్జీని కూడా సీబీఐ అరెస్ట్ చేసింది.

Related Posts