YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

రఘురామరాజుకు బెయిల్

రఘురామరాజుకు బెయిల్

న్యూఢిల్లీ, మే 21, 
వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆయనకు షరతులతో కూడిన బెయిల్ ను సర్వోన్నత న్యాయస్థానం మంజూరు చేసింది.‘‘సీఐడీ విచారణకు రఘురామ పూర్తిగా సహకరించాలి. విచారణ అధికారి ఎప్పుడు పిలిచినా హాజరుకావాలి. రఘురామకృష్ణరాజు మీడియా, సోషల్‌మీడియా ముందుకు రాకూడదు. ఎలాంటి వీడియోలు పోస్ట్‌ చేయకూడదు. ఇంటర్వ్యూలు ఇవ్వకూడదు. మీడియా ముందు కాళ్లు, చేతులు చూపించే విన్యాసాలు చేయొద్దు. రూ.లక్ష పూచీకత్తును ట్రయల్స్‌ కోర్టులో జమ చేయాలి’’ అని ఆదేశించింది. రఘురామ తరఫు న్యాయవాది ముకుల్ రోహాత్గీ వాదనలు వినిపించిన అనంతరం ప్రభుత్వ తరఫు న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు వినిపించారు. ఆయన వాదనల మధ్యలో జోక్యం చేసుకున్న సుప్రీం ధర్మాసనం... వాదనలు త్వరగా వినిపించాలని దవేకి స్పష్టం చేసింది. దాంతో ఆయన తన వాదనల్లో వేగం పెంచారువాదనల సందర్భంగా దవే ఏమన్నారంటే...ఆర్మీ ఆసుపత్రి వైద్య నివేదికతో మేం విభేదించడంలేదు. అయితే ఆర్మీ ఆసుపత్రి నివేదికలో రఘురామ గాయాలకు గల కారణాలు లేవు. జీజీహెచ్ నివేదిక కూడా సరైనదే. గతంలో చోటుచేసుకున్న గుజరాత్ సొసైటీ కేసు ఆధారంగా బెయిల్ పిటిషన్ ను కొట్టివేయాలి. హైకోర్టులో ఇంకా మెరిట్ ఆధారంగా నిర్ణయం తీసుకోలేదు. అలాంటప్పుడు దాన్ని సవాల్ చేస్తూ సుప్రీంలో ఎలా పిటిషన్ దాఖలు చేస్తారు? బెయిల్ కోసం కింది కోర్టుకు వెళ్లమని హైకోర్టు ఆయనకు చెప్పింది. కానీ, ఎంపీనంటూ బైపాస్ లో సుప్రీంకు వచ్చారు. ఎంపీ అయినంత మాత్రాన అది ఎలా సాధ్యమవుతుంది?"రఘురామ రెండు వర్గాలను రెచ్చగొట్టేలా మాట్లాడారు. అన్ని హద్దులను మీరి ప్రవర్తించారు. కరోనా వేళ ఇదంతా సరికాదని సమయం ఇచ్చాం. ఎంపీకి చెందిన 45 వీడియోలను సేకరించిన సీఐడీ ప్రాథమిక విచారణ చేసింది. కులం, మతం ఆధారంగా సమాజంలో అలజడి రేపేందుకు యత్నించారు. ఇవన్నీ రాజద్రోహం కిందకే వస్తాయి. రఘురామ తాను ఎంపీనని పదేపదే చెబుతున్నారు... ఎంపీ అయినంత మాత్రాన ప్రజలను రెచ్చగొట్టేందుకు లైసెన్స్ ఇచ్చినట్టు కాదు. రఘురామకృష్ణరాజు ఎంపీ అని రోహాత్గీ పదేపదే చెబుతున్నారు... చట్టం అందరికీ ఒక్కటే" అని తెలిపారు.సందర్భంగా న్యాయస్థానం జోక్యం చేసుకుని... రఘురామ కాలి వేలికి అయిన ఫ్రాక్చర్ గురించి ఏంచెబుతారని ప్రశ్నించింది.అందుకు దవే బదులిస్తూ..."ఆసుపత్రికి అంబులెన్స్ లో తీసుకెళతామంటే ఎంపీ నిరాకరించారు. సొంత కారులోనే ఆసుపత్రికి వెళ్లారు. కారులో ఓవైపు అభివాదం చేస్తూ, మరోవైపు కాలి గాయాలు చూపారు. రఘురామను టార్చర్ చేయాలని పోలీసులు భావిస్తే కాలి రెండో వేలునే లక్ష్యంగా చేసుకుని ఎలా కొడతారు? ఎంపీ స్థాయి వ్యక్తి విషయంలో పోలీసులు ఎప్పటికీ అలా చేయరు. పైగా వైద్య నివేదికలో ఫ్రాక్చర్ పై అస్పష్టత ఉంది. అది కొత్తదా, పాతదా అనేది తెలియడంలేదు. గత ఎక్స్ రే రిపోర్టుల్లో ఫ్రాక్చర్ లేదు. ఎక్స్ రే రిపోర్టులు అబద్ధం చెప్పవు. ఆ ఫ్రాక్చర్ తర్వాత అయిందే. రఘురామ సీబీఐ విచారణ కోరుతున్నారు... సీబీఐ విచారణ కోరేంత అత్యవసరం ఏముంది? రఘురామ ఆసుపత్రిలో ఉన్నందున విచారణ ఈ నెల 25కి వాయిదా వేయండి" అంటూ సుప్రీం ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు.తన వాదనల సందర్భంగా దవే... భీమా కోరేగావ్ కుట్ర కేసు ప్రొసీడింగ్స్ ను కూడా ప్రస్తావించారు. మేజిస్ట్రేట్ కోర్టు ఆదేశం పాటించలేదని హైకోర్టు ధిక్కరణ నోటీసు ఇవ్వడం సరికాదన్నారు.

Related Posts