YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

పార్టీ మారినా... కలిసి రాని కాలం

పార్టీ మారినా... కలిసి రాని కాలం

విజయవాడ, మే 22,
వైసీపీలోకి ఆర్భాటంగా వచ్చిన నేతలు ఇప్పుడు సైలెంట్ ఎందుకయ్యారు? వారంతా తిరిగి సొంత పార్టీలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నారా? అంటే అవుననే అంటున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్లయింది. ఈ రెండేళ్ల కాలంలో అనేక మంది టీడీపీ నేతలు వైసీపీలోకి చేరిపోయారు. ఎమ్మెల్యేలు నలుగురు వైసీపీకి మద్దతుదారులుగా ఉన్నా వారు ఈ మూడేళ్లు కొనసాగేందుకే ఇష్టపడతారు. వారు నలుగురు టీడీపీలోకి వెళ్లేందుకు ఇప్పట్లో ప్రయత్నించారు.అయితే గత ఎన్నికల్లో ఓటమి పాలయిన నేతలు కొందరు టీడీపీ నుంచి వైసీపీలో చేరారు. వారంతా ఇప్పుడు పునరాలోచనలో పడ్డారని తెలుస్తోంది. ప్రకాశం జిల్లాలో శిద్దా రాఘవరావు, కదిరి బాబూరావు, పాలపర్తి డేవిడ్ రాజు, కడప జిల్లా నుంచి రామసుబ్బారెడ్డి వంటి నేతలు పార్టీని వదిలి వెళ్లిపోయారు. వీరిలో పాలపర్తి డేవిడ్ రాజు తిరిగి టీడీపీలోకి వచ్చేందుకు సిద్ధమయ్యారు. మిగిలిన నేతలు కూడా అదే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది.శిద్ధా రాఘవరావు తనకున్న వ్యాపారాల దృష్ట్యా టీడీపీ నుంచి వైసీపీలో చేరారన్నది వాస్తవం. అయితే ఆయన వైసీపీలో కంఫర్ట్ గా లేరు. వ్యాపార కార్యక్రమాలకే శిద్ధారాఘవరావు పరిమితమయ్యారు. వైసీపీ నేతలు కూడా ఆయనను పెద్దగా పట్టించుకోవడం లేదు. వైసీపీలో ఉన్నా శిద్ధా రాఘవరావుకు వచ్చే ఎన్నికల్లో ఎక్కడ సీటు ఇచ్చే పరిస్థితి ఉండదు. అందుకే ఆయన వైసీపీలో అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారంటున్నారు.ఇక మరో నేత కదిరి బాబూరావు పరిస్థితి కూడా అంతే. బాలకృష్ణకు ప్రియమిత్రుడైన కదిరి బాబూరావు 2014లో కనిగిరి నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2019 ఎన్నికల్లో దర్శినుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. బాలకృష్ణ సహకారం ఉండటంతో ఆయనకు టీడీపీలో టిక్కెట్ దొరకడం సులువు. కానీ వైసీపీలో అది సాధ్యం కాదు. పైగా జనసేన, బీజేపీతో కలసి టీడీపీ పోటీ చేస్తుందన్న కారణంతో కదిరి బాబూరావు కూడా వైసీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన కూడా టీడీపీలో చేరే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

Related Posts