YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

పార్టీ పనైపోయిందా

పార్టీ పనైపోయిందా

చెన్నై, మే 22, 
తమిళనాడు ఎన్నికల తర్వాత ఆ రాష్ట్ర రాజకీయాల్లో అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికల సందర్భంగా పార్టీ పెట్టిన వారు ఇప్పుడు పునరాలోచనలో పడ్డారు. కమల్ హాసన్ ఇప్పుడు పార్టీని మూసివేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కనీస పనితీరు కనపర్చకపోవడం, దారుణ ఓటమిని చవిచూడటంతో కమల్ హాసన్ తన పార్టీ ఉంచినా లాభం లేదని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.కమల్ హాసన్ తమిళనాడు రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని భావించారు. కింగ్ మేకర్ అవ్వాలనుకున్నారు. అన్నాడీఎంకే, డీఎంకేలకు వ్యతిరేకంగా కూటమిని ఏర్పాటు చేశారు. తొలి నుంచి బీజేపీని వ్యతిరేకిస్తున్న కమల్ హాసన్ ప్రాంతీయ పార్టీలైన డీఎంకే, అన్నాడీఎంకేలను కూడా వ్యతిరేకించారు. ఆరెండు అవినీతి పార్టీలని ఆయన భావించారు. అందుకోసమే ఆయనతృతీయ కూటమిని ఏర్పాటు చేసి ఎన్నికల బరిలోకి దిగారు.కానీ తమిళనాడు ఎన్నికల్లో కనీసం ఒక్క స్థానంలోనైనా విజయం సాధించలేదు. ఒకటి, రెండు స్థానాలు తప్పించి అన్ని స్థానాల్లో డిపాజిట్ కోల్పోయింది. తాను పోటీ చేసిన కోయంబత్తూరు దక్షిణ నియోజకవర్గం నుంచి కూడా కమల్ హాసన్ గెలవలేకపోయారు. దీంతో కమల్ హాసన్ తీవ్ర నిరాశలో మునిగిపోయారు. విలువలతో కూడిన రాజకీయాలు చేయాలని భావించిన కమల్ హాసన్ కు తమిళ ప్రజలు షాకిచ్చారు.దీనికితోడు ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీ నేతలు వరసగా రాజీనామాలు చేయడం కూడా ఆయన మనస్థాపానికి గురయ్యారు. వచ్చే ఎన్నికల వరకూ నిరీక్షించడం, పార్టీని నడపటం సాధ్యం కాదని కమల్ హాసన్ డిసైడ్ అయ్యారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ప్రజలు తన పార్టీ పట్ల ఆసక్తి కనపర్చక పోవడం కూడా ఆయన రాజకీయాల నుంచి వైదొలగాలని నిర్ణయించుకోవడానికి ఒక కారణంగా చెబుతున్నారు. కమల్ హాసన్ మక్కల్ నీది మయ్యమ్ పార్టీ పెట్టి మూడేళ్లు అవుతుంది. మూడేళ్లకే మూసేయాల్సి వస్తుంది.

Related Posts