YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

దంచికొడుతున్న ఎండలు

దంచికొడుతున్న ఎండలు

రాష్ట్రంలో ఎం డలు మండుతున్నాయి. వారం రోజులుగా ఉష్ణోగ్రతలు విప రీతంగా పెరిగిపోతుండడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతు న్నారు. అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోతలతో రాష్ట్రం నిప్పుల కొ లిమిని తలపిస్తున్నది. ప్రతి ఏటా సుమారుగా మే చివరి వా రంలో నమోదయ్యే ఉష్ణోగ్రతలు ఏప్రిల్‌లోనే నమోదవుతుం డటంతో మండుటెండలకు జనంనానా అవస్థలు పడుతూ పిట్టల్లా రాలిపోతున్నారు.ఉపాధి హామీ పనులకు వెళ్లే రైతులు, కూలీలతో పాటు రోజువారీ పనులు చేసుకొనే వారు తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్నారు. అత్యవసర పనులుంటే తప్ప బయటకు రావడం లేదు. ఎండ తీవ్రత కారణంగా వివిధ నగరాలు, పట్టణాలలోని ప్రధాన రహదారులు బోసి పోతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో కొంత వరకు ఎండ వేడి నుండి రక్షణ పొందేందుకు ప్రజలు చెట్ల నీడను ఆశ్రయిస్తుండగా, కాంక్రీట్ జంగల్‌గా మారిన పట్టణాల్లో ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు.విపరీతమైన సూర్యరశ్మి వల్ల శరీరంపై వేడిపొక్కులు, సెగ గడ్డలు, చెమటకాయలు వచ్చి అనేక మంది ప్రజలు అనారోగ్యానికి గురౌవుతున్నారు ఎండదెబ్బకు గురై వివిధ ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య నిత్యం పెరు గుతున్నది. .ఆదిలాబాద్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల్లో గత నాలుగు రోజులుగా రికార్డు స్థాయిలో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మిగిలినఇతర జిల్లాల్లో రికార్డు స్థాయిల్లో 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతోంది. ఏప్రిల్ నెలలోనే 44 డిగ్రీల సెల్సియస్‌గా ఉష్ణోగ్రతలు నమోదవుతూ పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే మే నెలలో పరిస్థితి ఏ విధంగా ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మేలో పరిస్థితి మరింత తీవ్రంగా ఉండవచ్చని వాతావరణ శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.ఎండలు మండిపోతుండటంతో పలు జిల్లాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోయి మంచినీటి కష్టాలు తీవ్రమవుతున్నాయి. బావులన్నీ ఎండిపోతుండగా బోరు బావుల్లో నీరు అడుగంటిపోతోంది. చెరువులు, కుంటల్లో చుక్కనీరు కనిపించని పరిస్థితి ఏర్పడింది. పశువులకు తాగేందుకు నీళ్ళు దొరకని  గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో ప్రజలు సైతం కూలర్లు, ఎసిలను ఆశ్రయిస్తున్నారు. ఎండల వేడిమి నుంచి ప్రజలు ఉపశమనం పొందేందుకు శీతలపానియాలు, పండ్లరసాలు, కొబ్బరిబోండాలు, మజ్జిగ, ఐస్‌క్రీంలు, పుచ్చకాయల షాపుల ముందు క్యూ కడుతున్నారు.దంచికొడుతున్న ఎండలకు జిల్లాలో రోజుకో ప్రాంతంలో ప్రజలు వడదెబ్బకు గురై మృత్యువాత పడుతున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ప్రజలు ఎండలో బయటకు వెళ్ళేందుకు జంకుతున్నారు

Related Posts