విశాఖపట్నం
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో కార్మికులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలు 100వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా కొవిడ్ నిబంధనలు పాటిస్తూ స్టీల్ ప్లాంట్ ప్రధాన ద్వారం వద్ద ఉక్కు పరిరక్షణ, కార్మిక సంఘ నేతలు నిరసన తెలుపు తున్నారు. నిరసనకు సీపీఎం, సీపీఐ, టీఎన్టీయూసీ మద్దతు తెలిపాయి. రాష్ట్ర ఎంపీలందరూ కలిసి ఉక్కు పరిశ్రమను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని పరిరక్షణ సమితి నేతలు కోరుతున్నారు. కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉప సంహరించుకునే వరకూ ఉద్యమాన్ని ఆపబోమని నిర్వాసిత గ్రామాల ప్రజలు చెబుతు న్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయడం పట్ల కార్మిక సంఘాల నాయకులు అయోధ్య రామయ్య హర్షం వ్యక్తం చేశారు.