YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ఇక పోలీసు బాదుడు

ఇక పోలీసు బాదుడు

నల్గోండ
తెలంగాణవ్యాప్తంగా లాక్డౌన్ మరింత కఠినంగా అమలు అవుతున్న సంగతి తెలిసిందే. అయితే.. ఉదయం 10 గంటల తర్వాత అత్యవసర పనులను నిమిత్తం వచ్చిన వారు కొందరైతే.. అనవసరంగా రోడ్ల మీదికి వచ్చే వారు మరి కొందరు. ఈ నేపథ్యంలో.. రాత్రి, ఈరోజు ఉదయం నల్లగొండ పట్టణం సహా పలు చోట్ల పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. ప్రస్తుతం మనం చూస్తున్న విజువల్స్.. నలగొండ టూ టౌన్ పోలీస్ స్టేషన్, క్లాక్ టవర్  ప్రాంతంలో జరిగింది. హాస్పిటల్ పనిమీద, ఇతర అత్యవసర పని నిమిత్తం వస్తున్నామని చెప్పిన కూడా.. టూ టౌన్ ఎస్.ఐ. నరసింహ లాఠీకి పని చెప్పారు. బైక్ మీద వెళ్తున్న వాళ్లని లాఠీతో చితకబాదారు. ఆటో డ్రైవర్ ను ఆటో నుంచి బయటికి లాగి కొట్టారు. మెడికల్ రిప్రజెంటేటివ్స్, మీడియా ప్రతినిధులు అని చూడకుండా.. టూ టౌన్ పరిధిలో లాఠీలకు పని చెప్పడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నారు..? ఎందుకు బయటికి వచ్చారు..? అని సరైన విధానం తెలుసుకున్న తర్వాత సదరు వ్యక్తిపై కేసు నమోదు చేసి, సీజ్ చేయాలని ఆదేశాలు ఉన్నాయి. అయితే.. ఇవేమీ పట్టనట్లుగా తమను కొట్టడానికి పర్మిషన్ ఇచ్చారు అన్నట్టుగా.. నలగొండ టూ టౌన్ ఎస్ఐ నరసింహ లాఠీకి అని చెప్పడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Related Posts