YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

మే 10 నుంచి నాగార్జున నాని మూవీ షెడ్యూల్

 మే 10 నుంచి నాగార్జున నాని మూవీ షెడ్యూల్

టాలీవుడ్‌లో ప్రస్తుతం మల్టీస్టారర్ సినిమాల హంగామా మొదలైంది.  నాగార్జున, నాని కెరీర్‌లో ఎప్పుడూ లేని విధంగా మల్టీస్టారర్ మూవీని రూపొందిస్తున్నారు.వెంకటేష్-వరుణ్‌తేజ్  కాంబినేషన్‌లో సినిమా, నాగార్జున-నాని  చిత్రంపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు ఉన్నాయి.యువ దర్శకుడు ఆదిత్య ఈ సినిమా కాన్సెప్ట్ మీద చాలా నమ్మకంగా ఉన్నాడు. ఇక ఇద్దరు మంచి మార్కెట్ ఉన్న హీరోలే కావడంతో భారీ బడ్జెట్‌తో సినిమాను తెరకెక్కిస్తున్నారు. కథలో అవసరమైన కొన్ని మేజర్ సెట్స్‌ను దర్శకుడు భారీగా ప్లాన్ చేసుకున్నాడట. నిర్మాత అశ్వనీదత్ ఏ మాత్రం తగ్గకుండా భారీగా ఉండేలా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అసలు విషయానికొస్తే సినిమా కోసం అతి పెద్ద  కాలనీ సెట్ వేస్తున్నారు. గత నెల నుంచి ఈ సెట్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇందుకోసం దాదాపు కోటి రూపాయలను ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ షెడ్యూల్‌ను ప్రారంభించనున్నారు. ఇక మే 2 నుంచి ఒక చిన్న షెడ్యూల్‌ను ప్రారంభించి దాన్ని తొందరగా పూర్తి చేయాలని అనుకుంటున్నారు. నాని కూడా తనకు సంబంధించిన సీన్లను అప్పుడే ప్రారంభించమని అన్నాడట. ఇక నాగార్జున మాత్రం కొంచెం ఆలస్యంగా ఎంట్రీ ఇవ్వనున్నాడు. మే 10 నుంచి దర్శకుడు ఆదిత్య ఆయనకు సంబంధించిన సన్నివేశాలను తెరకెక్కించేలా ప్లాన్ చేసుకున్నాడు. రష్మిక మండన్న, ఆకాంక్షసింగ్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు.

Related Posts