YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

ఉత్పత్తి సామర్థ్యం అంచనావేయకుండా ఎలా ప్రకటిస్తారు... కేంద్ర ప్రభుత్వం పై మండిపడ్డ సీరం ఇన్ స్టిట్యూట్ సంస్థ

ఉత్పత్తి సామర్థ్యం అంచనావేయకుండా ఎలా ప్రకటిస్తారు...  కేంద్ర ప్రభుత్వం పై మండిపడ్డ సీరం ఇన్ స్టిట్యూట్ సంస్థ

న్యూ ఢిల్లీ మే 22
దేశంలో వ్యాక్సిన్ ఫైట్ మొదలైంది. ఉత్పత్తి సామర్థ్యాలు అంచనావేయకుండా కేంద్ర ప్రభుత్వం 18 సంవత్సరాల పైబడిన వారికి వ్యాక్సిన్ వేస్తామని ప్రకటించడం చిచ్చు రేపుతోంది. దీనిపై టీకా కంపెనీ సీరం మండిపడింది. అస్సలు ఉత్పత్తి సామర్థ్యం అంచనావేయకుండా ఎలా ప్రకటిస్తారని ఏకంగా కేంద్రాన్నే నిలదీసిన పరిస్థితి దాపురించింది. ఇది కేంద్రం ఫెయిల్యూర్ గా అభివర్ణిచింది.దేశంలో మొదట తయారు చేసిన వ్యాక్సిన్ కోవీషీల్డ్. బ్రిటన్ లోని ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ సహాయంతో భారత్ లోని సీరం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సంస్థ ఈ ‘కోవీషీల్డ్’ వ్యాక్సిన్ ను తయారు చేసి భారత్ సహా వివిధ దేశాలకు పంపిణీ చేస్తోంది.అయితే మొదట వైద్యులు వైద్య సిబ్బందికి కేంద్రం ఈ వ్యాక్సిన్ ను పంపిణీ చేసింది. ఆ తర్వాత పరపతి కోసం పక్కదేశాలకు భారీగా పంచేసి ఉన్న స్టాకు అంతా కేంద్రం ఖాళీ చేసింది. ఇప్పుడు మళ్లీ ఉత్పత్తికి సమయం పట్టడం.. దేశంలో వ్యాక్సిన్ల కొరత.. ముందు చూపు లేని కేంద్రం వైఖరి.. ఒత్తిడిపై తాజాగా సీరం ఇన్ స్టిట్యూట్ సంస్థ మండిపడింది.కోవిషీల్డ్ ను ఉత్పత్తి చేస్తున్న సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా కేంద్రం తీరుపై మండిపడింది. 45 సంవత్సరాల వయసు వారికి వ్యాక్సినేషన్ పూర్తి కాకుండానే వ్యాక్సిన్ల స్టాకు పట్టించుకోకుండా 18-45 సంవత్సరాల వారికి వ్యాక్సినేషన్ ప్రారంభించిందని విమర్శించింది.ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రపంచం ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ.హెచ్.ఓ) మార్గదర్శకాలూ కేంద్రం పాటించలేదని పేర్కొంది. వ్యాక్సిన్లు అందుబాటులో లేవని తెలిపినా కేంద్రం 18-45 వయసు వారికి వ్యాక్సినేషన్ ప్రారంభించిందని తెలిపింది.

Related Posts