YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

వ్యక్తిగత చికిత్స కోసం యశోద ఆసుపత్రికి.. పబ్లిసిటీ కోసం గాంధీ ఆసుపత్రికి.. సీఎం కేసీఆర్ పై వైఎస్ షర్మిల విమర్శల వర్షం

వ్యక్తిగత చికిత్స కోసం యశోద ఆసుపత్రికి.. పబ్లిసిటీ కోసం గాంధీ ఆసుపత్రికి.. సీఎం కేసీఆర్ పై వైఎస్ షర్మిల విమర్శల వర్షం

హైదరాబాద్ మే 22
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై అదే పనిగా విమర్శలు సంధిస్తున్న వైఎస్ షర్మిల మరోసారి చెలరేగిపోయారు. సీఎం కేసీఆర్ చేసే పనుల్ని తెలంగాణ ప్రజలు గమనించటం లేదని అనుకుంటే పొరపాటేనని మండిపడ్డారు. వ్యక్తిగత చికిత్స కోసం యశోద ఆసుపత్రికి వెళ్లిన కేసీఆర్.. పబ్లిసిటీ కోసం గాంధీ ఆసుపత్రికి వెళ్లారన్నారు. ఇలాంటివన్నీ ప్రజలు గమనిస్తూనే ఉంటారన్నారు.కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని తాము నిత్యం కోరుతున్నా.. దున్నపోతు మీద వానపడ్డ చందంగా ఈ విషయాన్ని ప్రభుత్వం పట్టించుకోవటం లేదన్న షర్మిల.. తమ ఒత్తిడిని తట్టుకోలేకనే కరోనాను ఆరోగ్య శ్రీలో కాకుండా ఆయుష్మాన్ భారత్ లో చేర్చి చేతులు దులుపుకున్నారని పేర్కొన్నారు. ఆయుష్మాన్ భారత్ పథకం కింద తెలంగాణలోని 26 లక్షల కుటుంబాలకే లబ్థి చేకూరుతుందని.. అదే ఆరోగ్య శ్రీ తో అయితే 80 లక్షల కుటుంబాలకు మేలు జరుగుతుందన్నారు.ఆయుష్మాన్ భారత్ లో అన్ని వ్యాధులకు రూ.5లక్షల వరకే పరిమితి ఉందని.. అదే ఆరోగ్య శ్రీలోని కొన్ని పథకాలకు రూ.13 లక్షల వరకు పరిమితి ఉందని గుర్తు చేశారు. కరోనా వైద్యానికి లక్షలాది రూపాయిలు ఖర్చు అవుతున్నాయి.. ఈ ఖర్చును ఎవరు భరిస్తారో కేసీఆర్ చెప్పాలన్నారు. మొత్తానికి తన ఉనికిని చాటుకునేలా రోజువారీగా ఏదో ఒక అంశాన్ని ప్రస్తావిస్తూ.. కేసీఆర్ సర్కారుపై విమర్శలు చేస్తూ ప్రెస్ నోట్లను రిలీజ్ చేస్తున్నారు వైఎస్ షర్మిల.

Related Posts