న్యూఢిల్లీ మే 22
భారత దేశంలోకెల్లా అతిపెద్ద వాణిజ్య బ్యాంక్.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తన ఖాతాదారులకు అలర్ట్ జారీ చేసింది. ఆదివారం 14 గంటల పాటు ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఎస్బీఐ యోనో, ఎస్బీఐ యోనో లైట్ సేవలు అందుబాటులో ఉండవని తెలిపింది. అయితే ఆర్టజీఎస్ సేవలు యధావిధిగా అందుబాటులో ఉంటాయని వివరించింది.శనివారం (మే 22) బ్యాంకింగ్ బిజినెస్ అవర్స్ ముగిసిన తర్వాత నిఫ్ట్ సిస్టమ్స్ సాంకేతికంగా అప్‌గ్రేడేషన్ చేస్తున్నట్లు ఎస్బీఐ వెల్లడించింది. కనుక శనివారం (ఆదివారం) అర్థరాత్రి 12:01 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఎస్బీఐ యోనో, ఎస్బీఐ యోనో లైట్ సేవలు ఖాతాదారులకు లభించవు.భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) ఈ నెల 22వ తేదీన బ్యాంకింగ్ బిజినెస్ అవర్స్ ముగిసిన తర్వాత నిఫ్ట్ సిస్టమ్స్ అప్‌గ్రెడేషన్ ప్రక్రియ చేపడుతుందని ఎస్బీఐ ఓ ట్వీట్‌లో వెల్లడించింది. అందువల్ల శనివారం అర్థరాత్రి 12.01 గంటల నుంచి ఆదివారం (మే 23) మధ్యాహ్నం రెండు గంటల వరకు నిఫ్ట్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో, యోనో లైట్ సేవలు లభించవని ట్వీట్ చేసింది.