YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

అమ్మగా ఆదుకున్న నర్సు సొంతబిడ్డకు పొతపాలు.. కరోనా బాధితురాలి బిడ్డకు తల్లయిన వైనం

అమ్మగా ఆదుకున్న నర్సు సొంతబిడ్డకు పొతపాలు.. కరోనా బాధితురాలి బిడ్డకు తల్లయిన వైనం

భైంసా
కరోనా కష్టకాలంలో ఆ నర్సు అమ్మలా మారింది.. కన్నతల్లి కొవిడ్తో పాలివ్వలేని దైన్యస్థితిని, వారింట అంతా కరోనాతో సతమతమవుతున్న నిస్సహాయ పరిస్థితిని నిండు మనసుతో అర్థం చేసుకుంది. చనుబాలు అత్యవసరమైన మూడు నెలల పసికందుకు తానే తల్లయింది. వారం పాటు కడుపారా స్తన్యమిచ్చి ఆ బిడ్డ ఆకలి తీర్చింది.. ఆలనాపాలనా చూసింది. ఏడాది వయసున్న సొంత బిడ్డకు పోతపాలు పట్టి మరీ మాతృప్రేమకు హద్దులుండవని చాటిచెప్పింది. నిర్మల్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన దంపతులు ఉద్యోగరీత్యా రెండు నెలల శిశువుతో కర్ణాటకకు వెళ్లారు. అక్కడి బ్యాంకులో పనిచేస్తున్న భర్తకు నెల కిందట కొవిడ్ సోకడంతో.. వారిని భార్య పుట్టింటివారు భైంసాకు తీసుకువచ్చారు. అంతలోనే భార్యకు, ఆమె తల్లిదండ్రులకు సైతం వైరస్ సోకింది. ఉద్యోగ దంపతులు మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్లో, భార్య తల్లిదండ్రులు భైంసా ఆసుపత్రిలో చేరారు. వారి వద్ద కారు డ్రైవర్గా పనిచేస్తున్న మహేందర్ బాధితులకు సేవలందిస్తున్నారు. కరోనా బాధితురాలి బిడ్డకు పాలిచ్చి కాపాడిన నర్సు ఈ క్రమంలో దంపతుల మూడు నెలల బాలుణ్ని సాకేవారు లేకపోయారు. భైంసా ప్రాంతీయ ఆసుపత్రిలోనే నర్సుగా పనిచేస్తున్న డ్రైవర్ మహేందర్ భార్య భుక్యా సునీత వారి బాధను పెద్ద మనసుతో అర్థం చేసుకుంది. కొవిడ్ బాధిత దంపతుల మూడు నెలల శిశువును నిర్భయంగా ఇంటికి తెచ్చుకుంది. ఏడాది వయసున్న తన బిడ్డకు పది రోజుల పాటు పోతపాలు పోస్తూ.. వెంట తీసుకొచ్చిన మూడు నెలల బాబుకు తన పాలు పట్టింది. రాత్రివేళ ఆసుపత్రిలో విధి నిర్వహణలో ఉండే ఆమె రెండుసార్లు భర్త సాయంతో ఇంటికి వచ్చి ఆ పసికందుకు పాలుపట్టి వెళ్లేది. ఈ క్రమంలో పలుమార్లు అస్వస్థతకు గురైన ఆ చిన్నారిని మహేందర్, సునీత దంపతులు ఎప్పటికప్పుడు పిల్లల వైద్య నిపుణుడితో వైద్యం చేయించారు. ప్రస్తుతం ఆ కుటుంబంలోని కొవిడ్ బాధితులంతా కోలుకున్నారు.

Related Posts