YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కడప గడపలో తాగు నీరు సంక్షోభం

కడప గడపలో తాగు నీరు సంక్షోభం

కడప జిల్లాల్లో తాగునీటి సంక్షోభం తీవ్ర రూపం దాల్చింది.జిల్లాలో 20 ఏళ్ల కరువు రికార్డులను పరిశీలిస్తే 18 ఏళ్లు కరువు బారిన పడినట్లు గణాంకాలు వెల్లడిస్తున్న నేపథ్యంలో తాగునీటి ఎద్దడి స్వైరవిహారం చేస్తోందికడప జిల్లా 51 మండలాల్లోని 800 గ్రామాల్లో ఏటా తాగునీటి ఎద్దడి ఏర్పడుతోంది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో 27 మండలాలను కరువు ప్రాంతాలుగా ఎంపిక చేసింది. ఇందులో కాశినాయన, పోరుమామిళ్ల వంటి రెండు మండలాల్లోనే 4,700 ట్యాంకర్ల ద్వారా తాగు నీటిని సరఫరా చేసింది. మిగిలిన మండలాల పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. .  ఇటువంటి విపత్తుల బారిన పడిన జిల్లాల పట్ల ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉంది.  నాలుగు నెలలుగా పిఎఒ, ట్రెజరీలో (ఎస్‌డిఎఫ్‌) స్టేట్‌ డిజాస్టర్‌ రెస్పాన్సివ్‌ నిధులు రూ.30 కోట్లు, 14 ఫైనాన్స్‌ నిధులు రూ.747 కోట్ల విడుదలపై ఫ్రీజింగ్‌ ఆంక్షలు విధించింది. ఫలితంగా తాగునీటి సరఫరా రవాణాకు అడ్డంకులు ఏర్పడ్డాయి. కడప జిల్లాలో రూ.మూడు కోట్లు, ప్రకాశం జిల్లాలో రూ.13 కోట్లు, అనంతపురం జిల్లాలో రూ.8 కోట్ల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా రూ.30 కోట్లకుపైగా బకాయి విడుదలపై ప్రభుత్వం ఫ్రీజింగ్‌ ఆంక్షలు విధించింది. ప్రభుత్వం స్టేట్‌ డిజాస్టర్‌ రెస్పాన్సివ్‌ నిధులతో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాల్సి ఉంది. ప్రయివేటు అద్దె బోర్లకు నిధులు కేటాయించడం, సమ్మర్‌ స్టోరేజీ ట్యాంకులను నింపుకోవడం, కొత్తబోర్లు వేసుకోవడం వంటి పనులను ఎస్‌డిఎఫ్‌ నిధులతో చేపట్టాల్సి ఉంది. ఇటువంటి విపత్కర పరిస్థితులు ఏర్పడినప్పటికీ జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్‌ వరకు పిఎఒ, ట్రెజరీ శాఖల్లో నిబంధనల పేరుతో ఫ్రీజింగ్‌ విధించడంతో రాష్ట్రంలో దాహం కేకలు మిన్నంటాయి. జిల్లాలో రోజుకు 100 ట్యాంకర్ల చొప్పున 4,700 ట్యాంకర్లకు రూ.మూడు కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. రాష్ట్రంలోని ఉభయగోదావరి, కృష్ణాజిల్లాలను పరిశీలిస్తే రూ.30 కోట్లకుపైగా చెల్లించాల్సి ఉన్నట్లు తెలుస్తోంది. కరువు జిల్లాల్లో నీటి సరఫరా ఏజెన్సీలకు బకాయి విడుదల చేయకపోవడంతో తాగునీటి సంక్షోభం ముదిరిపాకాన పడింది.

Related Posts