YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

కోవాగ్జిన్ ఉత్ప‌త్తికి అన్ని కంపెనీల‌కు ఆదేశాలివ్వాలి... కేంద్రాన్ని కోరిన ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్

కోవాగ్జిన్ ఉత్ప‌త్తికి అన్ని కంపెనీల‌కు ఆదేశాలివ్వాలి...  కేంద్రాన్ని కోరిన ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్

న్యూఢిల్లీ మే 23,
కోవాగ్జిన్ వ్యాక్సిన్ ఫార్ములాను ఇత‌ర కంపెనీల‌కు ఇచ్చేందుకు భార‌త్ బ‌యోటెక్ సంస్థ అంగీక‌రించింద‌ని, అయితే ఇండియాలో ఉన్న అన్ని ఫార్మా కంపెనీలు ఆ టీకాను ఉత్ప‌త్తి చేసే విధంగా ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేయాల‌ని ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ ఇవాళ కేంద్రాన్ని కోరారు. వీడియో సందేశం ద్వారా మాట్లాడుతూ.. విదేశాల వ‌ద్ద కోవిడ్ టీకాల‌ను కేంద్ర ప్ర‌భుత్వం 24 గంట‌ల్లో కొనుగోలు చేసి వాటిని అన్ని రాష్ట్రాల‌కు స‌ర‌ఫ‌రా చేయాన‌లని సూచించారు. ఇండియాలో వ్యాక్సిన్లు ఉత్ప‌త్తి చేసేందుకు విదేశీ కంపెనీల‌కు కూడా అనుమతి ఇవ్వాల‌ని ఆయ‌న తెలిపారు. కొన్ని దేశాలు అవ‌స‌రం క‌న్నా ఎక్కువ సంఖ్య‌లో టీకాల‌ను నిల‌వ చేసుకున్నాయ‌ని, వృధాగా ఉన్న‌ వ్యాక్సిన్లను స‌ర‌ఫ‌రా చేసే విధంగా ఆ దేశాలను అభ్య‌ర్థించాల‌ని కేంద్రాన్ని కోరారు. ఢిల్లీలో ఉన్న పూర్తి జ‌నాభాను వ్యాక్సినేట్ చేసేందుకు నెల‌కు 80 ల‌క్ష‌ల టీకాలు అవ‌స‌రం ఉంటుంద‌ని సీఎం కేజ్రీ తెలిపారు. ఢిల్లీకి మొత్తం 2.5 కోట్ల డోసులు అవ‌స‌రం ఉంటుంద‌ని, కానీ మే నెల‌లో 16 ల‌క్ష‌లు వ‌చ్చాయ‌ని, ఇక జూన్ నెల‌లో 8 ల‌క్ష‌లు వ‌స్తాయ‌న్నారు. ఈ రోజు నుంచి ఢిల్లీలో 18 నుంచి 44 ఏళ్ల మ‌ధ్య వారికి టీకాలు ఇవ్వ‌డం నిలిపివేశామ‌ని, వారికి పంపిన కోటా అయిపోయిన‌ట్లు సీఎం కేజ్రీ చెప్పారు.

Related Posts