YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

ఓట్ల శాతాన్ని పెంచుకున్న సీమాన్

ఓట్ల శాతాన్ని పెంచుకున్న సీమాన్

చెన్నై, మే 24, 
తమిళనాడు రాజకీయాల్లో డీఎంకే, అన్నాడీఎంకేలే అధికారంలోకి వస్తూ ఉన్నాయి. పదేళ్ల పాటు అధికారాన్ని చేపట్టిన అన్నాడీఎంకే ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలయింది. అయితే ఈ ఎన్నికల్లో ఒక నేత మాత్రం తన సత్తా చాటారు. ఒంటరిగా పోటీ చేసి తన విలువ ఏంటో రాజకీయ పార్టీలకు చూపించారు. ఆయనే నామ్ తమిళర్ కట్చి నేత సీమాన్. ఈ ఎన్నికల్లో ఓడినా రానున్న కాలంలో సీమాన్ తో జత కట్టేందుకు పార్టీలు పోటీ పడాల్సిన పరిస్థితి ఏర్పడింది.సీమాన్ సీనీ రంగం నుంచే వచ్చారు. 1990లో ఆయన సినీ నిర్మాతగా మారి తమిళ ప్రజలకు పరిచయమయ్యారు. 2011 ఎన్నికల్లో ఆయన నామ్ తమిళర్ కట్చి పేరుతో రాజకీయ పార్టీని స్థాపించారు. అప్పట్లో జయలలిత, కరుణానిధి నేతృత్వంలో జరిగినఎన్నికల్లో సీమాన్ 1.7 శాతం ఓట్లను దక్కించుకుంది. అయినా సీమాన్ నిరుత్సాహ పడలేదు. 2016 ఎన్నికల్లో పోటీ చేసిన సీమాన్ 2.15 శాతం ఓట్లను సాధించి అప్పట్లోనే అందరినీ ఆశ్చర్యపరిచారు.ఇక తాజాగా జరిగిన ఎన్నికల్లో 183 నియోజకవర్గాల్లో సీమాన్ తన పార్టీ నామ్ తమిళర్ కట్చి పోటీ చేసింది. తమిళనాడులో మూడు కూటములు ఉన్నప్పటికీ సీమాన్ ఏ పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు ఇష్టపడలేదు. ఒంటరిగానే పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో సీమాన్ పార్టీ ఎక్కడా విజయం సాధించకపోయినప్పటికీ అనేక నియోజకవర్గాల్లో మూడోస్థానంలో నిలవడం విశేషం. మక్కల్ నీది మయ్యమ్ పార్టీని కాదని ఎక్కువ శాతం మంది తమిళ ప్రజలు సీమాన్ వైపు నిలబడటం విశేషం.సీమాన్ పార్టీ కారణంగా అన్నాడీఎంకే 39 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటమి పాలయిందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఈ ఎన్నికల్లో సీమాన్ పార్టీకి 5శాతం ఓట్లు వచ్చాయి. మిగిలిన పార్టీలు ఏదో ఒక కూటమితో జత కట్టగా సీమాన్ మాత్రం ఒంటరిగానే పోటీ చేసేందుకు ఇష్టపడ్డారు. తమిళ రాజకీయాల్లో భవిష్యత్ ఉన్న నేతగా సీమాన్ పేరు అక్కడ మారుమోగుతుంది. వచ్చే ఎన్నికల్లో సీమాన్ తో పొత్తుకు డీఎంకే, అన్నాడీఎంకేలు ప్రయత్నిస్తాయన్న ప్రచారం ఇప్పటి నుంచే జరుగుతుండటం విశేషం.

Related Posts