YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం

చంద్రులిద్దరి గమ్యం ఒక్కటే

చంద్రులిద్దరి గమ్యం ఒక్కటే

కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి.. అన్నదాన్ని కొడితే కొట్టాలిరా ఢిల్లీ పీఠాన్ని కొట్టాలి అంటు న్నారు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు. దారులు వేర‌యినా ఇద్దరి గ‌మ్యం ఒక్కటే అన్నట్లు దూసుకుపోతున్నారునాకు 25 మంది ఎంపీల‌ను ఇవ్వండి. ఢిల్లీలో నేను చెప్పిన వ్యక్తే ప్రధాని అవుతారు. అప్పుడు కేంద్రం మ‌న చేతుల్లోనే ఉంటుంది` అంటారు ఒక‌రు. `హైద‌రాబాద్ కేంద్రంగా ప్రకంప‌న‌లు పుట్టిస్తా. త్వర‌లోనే ఢిల్లీ పీఠాలు ద‌ద్దరిల్లేలా చేస్తా.` అంటున్నారు మ‌రొక‌రు. . కర్ణాటకలో కాంగ్రెస్ గెలిస్తే.. చంద్రబాబు, కేసీఆర్ ల ప్రయత్నాలు మరింత ఊపందుకునే అవకాశం ఉంది. కర్ణాటక ఎన్నికలు దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తాయా... అంటే ఔననే సమాధానమే వస్తోంది. బీజేపీపై ప్రజ‌ల్లో వ్యతిరేకత ఉంద‌ని తేలిపోతే.. ఎన్డీఏలోని ఇత‌ర పార్టీలు కూడా వీరి వైపే చూడొచ్చు.ఒకరు రాష్ట్రానికి చేసిన అన్యాయంపై యుద్ధం చేస్తూ ప్రధానిని టార్గెట్ చేసుకుంటే.. మ‌రొక‌రు ఢిల్లీ స్థాయిలో చ‌క్రం తిప్పేందుకు వ్యూహాలు ర‌చిస్తున్నారు. త‌మ‌దైన వ్యూహాల‌తో ప్రధాని మోదీ ల‌క్ష్యంగా చెరో దారిలో వెళుతున్నారు. మ‌రి వీరి లక్ష్యం, గ‌మ్యాలు ఒకట‌వుతున్నప్పుడు వీరిద్దరూ ఒక్క‌ట‌వుతారా? లేదా అనే సందేహాలు వినిపిస్తున్నాయి. మరో వైపు ఆదివారం కేసీఆర్, చంద్రబాబు తనకు మిత్రుడేనని పేర్కొనడం...ఈ వాదనకు మరింత బలం ఇస్తోంది..టీడీపీ అధినేత చంద్రబాబు, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. జాతీయ రాజకీయాల్లో తమదైన ముద్ర వేయాలని గట్టి ప్రయత్నాలు ప్రారంభించారు. రైతు ఎజెండాను భుజాన వేసుకుని కేసీఆర్, ఏపీ ప్రయోజనాల కోసం అంటూ చంద్రబాబు.. ఇద్దరూ ఇప్పుడు ఢిల్లీని టార్గెట్ చేసుకున్నారు. కేసీఆర్ ఇప్పటికే మమతా బెనర్జీ, హేమంత్ సోరెన్, దేవేగౌడ లాంటి ప్రాంతయ పార్టీల నేతలతో చర్చలు జరిపారు. శివసేన, డీఎంకే, బిజూజనతాదళ్ నేతలతోనూ చర్చలు జరిపేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. కరుణానిధి, స్టాలిన్ లతో సమావేశం కోసం చెన్నై వెళ్లారు. వారితో చర్చలు జరిపారు.కరుణానిధి ఆశీస్సులు తీసుకున్నారు. స్టాలిన్ తో అన్ని అంశాలపై చర్చించారు. ఇవ‌న్నీ ముగిసిన త‌ర్వాత‌.. మూడో ఫ్రంట్‌పై ఒక స్పష్టత వ‌చ్చే అవ‌కాశం లేక‌పోలేదు.ఇక ఏపీ సీఎం చంద్రబాబు నేరుగా జాతీయ రాజకీయ ప్రస్తావన తేవడం లేదు. ప్రధానిని నిర్ణయించబోయేది టీడీపీనే అంటున్నారు. ఏపీకి ఇచ్చిన హామీలు నెర‌వేరాల‌న్నా, హోదా రావాలన్నా, కేంద్ర ప్రభుత్వం రిమోట్ మన చేతుల్లో ఉండాలని దానికి 25 ఎంపీ సీట్లు తన‌కు ఇవ్వాల‌ని కోరుతున్నారు. అటు చంద్రబాబు,ఇటు కేసీఆర్ చెబుతున్నది వేర్వేరుగా అనిపిస్తున్నా అర్థం మాత్రం ఒక్కటే. అత్యధిక పార్లమెంట్ సీట్లు గెలిచి కేంద్రంలో చక్రం తిప్పడం ఇద్దరి లక్ష్యం. వీరిద్దరి ప్రయత్నాలకు కర్ణాటక ఎన్నికల తర్వాత ఊపు వచ్చే అకాశం ఉంది.ఎన్నికల ముందు బీజేపీకి, మోడీకి ఎంత పాజిటివ్ వేవ్ వచ్చిందో.. కర్ణాటక ఎన్నికల్లో ఓడిపోతే.. అదే స్థాయిలో నెగెటివ్ వేవ్ వచ్చే అవ‌కాశ‌లు మెండుగా ఉన్నాయి. ప్రస్తుతం ఏపీలో బీజేపీకి భవిష్యత్ లేదు, కాంగ్రెస్ కు సామర్థ్యం లేదని తెలితే.. కచ్చితంగా ఓ కూటమిగా ఏర్పడటానికే అవకాశం ఉంది. కేసీఆర్ నమ్మకం కూడా ఇదే. చంద్రబాబుకు ఇప్పటికే జాతీయ రాజకీయాల్లో పలుకుబడి ఉంది. అందుకే కూటమి కడతామని చెప్పకుండానే అన్నీ పార్టీలను సమన్వయ పరుస్తున్నారు. 15వ ఆర్థిక సంఘం విధివిధానాల వల్ల బీజేపీయేతర పాలిత రాష్ట్రాలకు నష్టం జరుగుతోందని, ఆ స‌మావేశాన్ని అమరావతిలో సమావేశం నిర్వహిస్తున్నారు. దీనికి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన పంజాబ్, కర్ణాటకలకు కూడా ఆహ్వానం పంపారు. కేసీఆర్ లక్ష్యం ఎన్నికల ముందు ఫ్రంట్ ఏర్పాటు అయితే.. చంద్రబాబు లక్ష్యం ఎన్నికల తర్వాత కూటమి. ఇలా ఇద్దరూ చెరో దారిలో వెళుతున్నా ల‌క్ష్యం మాత్రం ఒక్కట‌ని చెబుతున్నారు.

Related Posts