YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం విద్య-ఉపాధి తెలంగాణ

బల్దియాలో ఫ్రంట్‌లైన్ వారియర్స్‌ కష్టాలు

బల్దియాలో ఫ్రంట్‌లైన్ వారియర్స్‌ కష్టాలు

హైదరాబాద్, మే 24, 
వారంతా ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు.. హైదరాబాద్ శానిటేషన్ పరిరక్షణలో కీలక భూమిక పోషిస్తున్న వారు.. వారాంతపు సెలవు మినహాయిస్తే అన్ని రోజులు పని చేయాల్సిందే.. కరోనా కష్టకాలంలోనూ ఏమాత్రం జంకకుండా పనులు చేస్తున్నారు.. అలాంటి వారిని ఇప్పుడు సమస్యలు వెంటాడుతున్నాయి.. మరి పగలు రాత్రి తేడా లేకుండా కష్టపడుతున్న బల్దియా వారియర్స్‌కు వచ్చిన కష్టాలేంటి..? వారిని వేధిస్తున్న సమస్యలేంటో ఒకసారి చూద్దాం…బల్దియాలో ఫ్రంట్‌లైన్ వారియర్స్‌ను కష్టాలు వెంటాడుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో దాదాపు 23 వేల మంది కార్మికులు శానిటేషన్, మలేరియా విభాగాల్లో పనిచేస్తున్నారు. కరోనా కష్టకాలంలో ఫ్రంట్‌లైన్ వారియర్లుగా ఉండి నగరాన్ని శుభ్రం చేస్తున్న కార్మికులు.. అడపాదడపా కోవిడ్ బారిన పడుతున్నారు. రోడ్లు ఊడ్చడం.. అక్కడ ఉండే చెత్తను ఎత్తడం వంటి సందర్భాలతో పాటు బయోమెట్రిక్ మిషన్ల వాడకం ద్వారా కోవిడ్ బారిన పడుతున్నారు చాలామంది కార్మికులు. ప్రభుత్వ ఆస్పత్రుల వద్ద శుభ్రం చేయడం.. ఎక్కువ కేసులు వచ్చిన నివాస సముదాయాలు వద్ద ప్రత్యేక చర్యలు చేపట్టడం వంటి సందర్భాల్లో.. పలువురు కార్మికులు కరోనా బారిన పడుతున్నారంటున్నారు కార్మిక నేతలు.కార్మికులకు అవసరమైన రక్షణ పరికరాలు అందించాల్సిన బాధ్యతపై బల్దియాపై ఉంది. గత ఏడాది కరోనా ప్రారంభం తర్వాత నెల రోజుల్లో ఒక్కో కార్మికుడికి ఆరు వేల ఐదు వందల రూపాయల వరకు ఖర్చు చేసి మాస్కులు.. శానిటైజర్లు.. గ్లౌజులు.. సబ్బులు.. కొబ్బరినూనె.. షూ.. రెయిన్‌ కోట్‌ వంటివి అందజేశారు. ఈసారి కరోనా ఇంతగా పెరిగిపోతున్నా.. జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారులు తమను పట్టించుకోవడం లేదంటూ వాపోతున్నారు కార్మికులు. విధుల్లో వైరస్‌ బారిన పడిన కార్మికులు.. ఐసోలేషన్‌ లేదా ఆసుపత్రిలో ట్రీట్‌మెంట్‌ పొందాల్సిన పరిస్థితి. స్వల్ప లక్షణాలు ఉన్నవారు విధులకు హాజరవుతామన్నా.. సూపర్‌వైజర్లు, తోటి కార్మికులు వారిని విధులకు రావొద్దంటున్నారు. అలాంటి వారికి నెలలో 14 రోజులు లేదా 20 రోజుల వరకు వేతనం రావడం లేదు. దేశంలోని ఇతర రాష్ట్రాలు మున్సిపల్ కార్మికులకు దాదాపు 20 లక్షల వరకు బీమా సౌకర్యం కల్పించడంతో పాటు కష్టకాలంలో ఆదుకుంటున్నాయని.. బల్దియాలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని విమర్శిస్తున్నారు కార్మిక నేతలు.ఇప్పటికైనా ఉన్నతాధికారులు తమ సమస్యలపై దృష్టి పెట్టాలంటున్నారు బల్దియా కార్మికులు. తమకు అందుతున్నదే అంతంతమాత్రం నెల జీతమని.. అందులోనూ కటింగ్ పోతే ఎలా ప్రశ్నిస్తున్నారు. బల్దియా సిబ్బంది, అధికారులు వర్క్ ఫ్రమ్‌ హోమ్‌ పేరిట జీతాలు తీసుకుంటున్నారని.. వీధుల్లో పనిచేసే తమకు ఎందుకలా ఇవ్వరంటున్నారు కార్మికులు. చూడాలి.. బల్దియా అధికారులు వారి సమస్యలపై స్పందిస్తారో వేచి చూడాలి మరి.

Related Posts