YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ఎన్నికలే నా భర్తను చంపాయి

ఎన్నికలే నా భర్తను చంపాయి

మెదక్, మే 24,
ఇబ్బందుల్లేకుండా సాఫీగా సాగుతున్న జీవితం వారిది. అలాంటి వారి జీవితాన్ని కరోనా కాటేసింది. కరోనా దాటికి ఓ అధికారిణి ఏకంగా తన భర్త ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఇందుకు కారణం మాత్రం ఇటీవల నిర్వహించిన మున్సిపల్ ఎన్నికలే అంటూ ఆ అధికారిణి  తెలిపింది. ఎన్నికల విధుల్లో పాల్గొన్న సమయంలో ఆమెకు కరోనా సోకగా .. త‌ర్వాత ఆమె భర్తకు పాజిటివ్‌గా తేలింది. లక్షలు వెచ్చించిన ఆ అధికారిణికి మాత్రం తన భర్త ప్రాణం దక్కలేదు. ఈ విషయం తెలుసుకున్న అధికారులు కనీసం ఫోన్లోనైనా పరామర్శించకపోవడం బాధాకారం. ఈ హృదయ విదారక ఘటన సిద్దిపేట పట్టణంలో జరిగింది. కరోనా విజృంభిస్తుంది .. ఎన్నికలు నిర్వహించొద్దంటూ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఎన్నికల సంఘాన్ని పదేపదే ఆదేశించిన వారు వినలేదు. తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల విధుల్లో కోవిడ్ నిబంధనలు పాటిస్తున్నామని చెప్పినా .. ఎక్కడా పాటించిన దాఖలు కన్పించలేదు. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు భౌతిక దూరం పాటించకుండానే నామినేషన్లు వేయడం, పోలింగ్ కేంద్రాల వద్ద హడావిడి చేయడంతో చాలా మందికి కరోనా సోకిన విషయం తెలిసిందే. అదే తరహాలో ఎన్నికల విధుల్లో పాల్గొన్న సిద్దిపేట మున్సిపల్ అధికారి కుటుంబానికి సైతం కరోనా సోకింది. అప్పటి వరకు సాఫీగా సాగుతున్న వారి జీవితంలో కరోనా వైరస్ ప్రవేశించి వారి కుటుంబాన్ని కకావికలం చేసింది. కరోనా దాటికి ఆ అధికారిణి  తన భర్తను కోల్పోవాల్సి వచ్చింది.సిద్దిపేట మున్సిపల్ కార్యాలయంలో అధికారిగా విధులు నిర్వహిస్తున్న రాధకు అనురేందర్ రెడ్డితో 2006 లో వివాహమైంది. వారికి ఒక కూతురు, కొడుకు. అమరీందర్ రెడ్డి ప్రముఖ కంపెనీలో సాఫ్టువేర్ ఉద్యోగం చేస్తున్నారు. కరోనా కారణంగా ఇంటి వద్ద నుండి పనిచేస్తున్నారు. కాగా ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో విధులు నిర్వహించిన భార్య‌కు కరోనా సోకింది. కరోనా లక్షణాలు కన్పించడంతో ర్యాపిడ్ టెస్టు చేయించుకున్నారు. అందులో ఇద్దరికి నెగెటీవ్ వచ్చింది. అయినా లక్షణాలు కన్పించడంతో ఆ అధికారిణి తన భర్త అమరేందర్ ని సిద్దిపేటలోని సురభి మెడికల్ ప్రయివేటు కళాశాల ఆస్పత్రిలో చేర్పించారు. మూడు రోజులు ట్రీట్మెంట్ అందించారు. ఆక్సిజన్ కూడా పెట్టారు. కానీ ఆరోగ్యం బాగుపడలేదు. మరింత క్షీణించడంతో విషయాన్ని సీఎం భార్యకు తెలపగా హైదరాబాబ్ అపోలో ఆస్పత్రిలో చేర్పించింది. సిద్దిపేట ఆస్పత్రిలో రూ .68 వేల బిల్లు కాగా.. అపోలో ఆస్పత్రిలో రూ .5 లక్షలు వెచ్చించారు. అయినా భర్త ప్రాణం దక్కలేదు. ఓ అధికారి అయి ఉండి … అంత రాజకీయ పలుకుబడి ఉన్న ఆమెకే ఇలాంటి సంఘటన ఎదురైతే సామాన్యుల పరిస్థితి ఎలా ఉందో ఇట్టే అర్ధం చేసుకోవచ్చు.నేను సిద్దిపేట మున్సిపల్ లో విధులు నిర్వహిస్తున్నాను. నా భర్త సాఫ్ట్ వేర్. ఎన్నికల్లో పాల్గొన్న సమయంలో నాకు కరోనా సోకింది. నా భర్తకు కరోనా రావడంతో సిద్దిపేట ప్రయివేటు ఆస్పతిలో చేర్పించా. అక్కడ నుండి హైద్రాబాద్ అపోలో ఆస్పత్రికి తీసుకెళ్లా. లక్షలు దారపోసిన నా భర్త ప్రాణం దక్కలేదు. నాకు పెండ్లయి ఐదేండ్లే అవుతుంది. నా భర్త చావుకు మూమ్మాటికి రాష్ట్ర ప్రభుత్వందే తప్పు. వారి స్వార్ధ ప్రయోజనాల వల్ల నేను నా భర్తను కోల్పోయిన. ఇప్పుడు నా భర్త ప్రాణాన్ని వారు తిరిగి తెచ్చియ్యగలరా. నా కూతురు, కొడుకుకి తండ్రిని తెచ్చియగలరా అంటూ దిశతో తమ ఆవేదన వెలిబుచ్చింది. విషయం తెలుసుకున్న అధికారులు కనీసం తనను ఫోన్‌లో పరామర్శించలేదు. ఆపదలో ఆదుకుంటాడనే పేరున్న మంత్రి హరీశ్ రావు కూడా స్పందించలేదు. ఓ అధికారినై ఉండి కూడా తన భర్త ప్రాణాలు కాపాడుకోలేకపోయినందుకు చాలా బాధగా ఉంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి.

Related Posts