YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

కలకలం రేపుతున్న కాస్టింగ్ కౌచ్

కలకలం రేపుతున్న కాస్టింగ్ కౌచ్

సినీ ఆర్టిస్టు శ్రీరెడ్డి సినీ పరిశ్రమలో మహిళా ఆర్టిస్టుల పట్ల జరుగుతున్న అఘాయిత్యాల గురించి పై చర్చ ప్రారంభమైంది. నలుగురిలోకి వచ్చి తమకు జరుగుతున్న అవమానాలను, ఇబ్బందులను చెప్పుకుంటే అప్పుడప్పుడు వచ్చే ఆ నాలుగు క్యారెక్టర్లు కూడా రావని కన్నీళ్ళు దిగమింగుకొని తెలుగు సినీపరిశ్రమ లో ని జూనియర్ ఆర్టిస్టులు తమ జీవితాలను వెల్లదీస్తున్నారని అర్ధమవుతుంది. నాలుగు గోడల మధ్య జరిగే ఈ అఘాయిత్యాలకి సాక్ష్యాలు ఏముంటాయి.ఉదంతంపై తెలుగు సినీ పరిశ్రమలో పలు చర్చోపచర్చలు జరుగుతున్నాయి. శ్రీరెడ్డి ఎలుగెత్తి న కాస్ట్ కౌచింగ్ అనే దుర్మార్గమైన విధానం గురించి తెలుగు సినీ పరిశ్రమలోని పలువురు విభిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కొందరు ఈ సమస్యను సమాజంలో పలు రంగాలలో మహిళల పట్ల జరిగే అఘాయిత్యాల మాదిరే తెలుగు సినీ పరిశ్రమలో కూడా జరుగుతున్నదని అభిప్రాయపడుతుండగా మీడియా మాత్రం సినీ పరిశ్రమలో మాత్రమే ఇది జరుగున్నట్లు చూపుతున్నదని చెబుతున్నారు.పెద్ద మనుషులుగా చెలామణి అయ్యే వ్యక్తులను గుడ్డిగా నమ్మే సమాజం ఏ స్థాయిలేని చిన్నచిన్న కుటుంబాలనుండి వచ్చే మహిళలు చేసే అరోపణలను ఏమాత్రం పట్టించుకోవటంలేదు సరికదా సోషల్ మీడియాలలో ప్రత్యారోపణలు చేస్తూ కుంగిపోయేలా చేయడం, తిరిగి వారిపై కేసులు బనాయించడం విచారకరం. ఒకవేళ ఆరోపణలు చేస్తే దానికి రుజువులు చూపించలేక మౌనంగా, మానసికంగా కుమిలిపోవడం తప్ప మరే మార్గం లేకుండా పోతున్నది. కోట్లు కుమ్మరించి సినిమాలు నిర్మించే ఈ తెలుగు సినీ పరిశ్రమలోని పెద్దలకు కేవలం పెట్టుబడులు, లాభాలు, హీరో ల రెమ్యునరేషన్, స్టార్ డమ్ మాత్రమే కాదు, సినిమా నిర్మాణంలో పనిచేసే కిందిస్థాయి టెక్నిషియన్లు, కార్మికులు, జూనియర్ ఆర్టిస్టులు భాగస్వాములే అన్న వాస్తవాన్ని గమనించి అందరినీ మానవతా దృక్పధంతో చూడవలసినబాధ్యత ఉంది. జూనియర్ ఆర్టిస్టుల ఎంపిక కేవలం వారి అభినయం ఆధారంగా ఉండాలి తప్ప మరి ఏ ఇతర ప్రలోభాలకు ఆస్కారం లేకుండా చూడవలసిన బాధ్యత కూడా ఉంది. వారికి ఇచ్చే రెమ్యునరేషన్ పారదర్శకంగా సమానంగా ఉండాలి. వివిధ ప్రదేశాలలో జరిగే షూటింగ్ ప్రదేశాలలో హీరోల స్థాయిలో కాకున్నా కనీస వసతులు, కనీస మర్యాదలు ఇవ్వవలసిన అవసరం ఎంతైనా ఉంది. మధ్యవర్తుల ప్రమేయాన్ని సాధ్యమైనంతవరకు తగ్గిస్తూ, వారిచేస్తున్న అరాచకాలకు అడ్డుకట్టవేస్తూ, అరోగ్యకరమైన పరిశ్రమగా సినీ పరిశ్రమ ఎదిగేటట్లు పరిశ్రమ, ప్రభుత్వం సమన్వయంతో కృషిచేయాలి.అసలు భారతీయ మహిళ అందరి ముందుకు వచ్చి నాకు అన్యాయం జరిగిందని చెప్పడమే చాలా పెద్ద విషయం. అలాంటిది మహిళా జూనియర్ అర్టిస్టులు మీడియా ముందుకొచ్చి కన్నీళ్ళు పెడుతుంటే వారికి అండగా నిలవాల్సింది పోయి, తెలుగు సినీ పరిశ్రమలో అలాంటివేవీ ఉండవని ఎలా చెప్పగలుగుతారు ? నిప్పులేనిదే పొగరాదన్న సామెత ఈ విషయంలో ముమ్మాటికి నిజం. ఈ ఆరోపణలను నిగ్గుదేల్ఛాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించి దోషులను శిక్షించాలి.సమాజంలో మాదిరే ఇక్కడకూడా చాలా కొద్దిమంది మాత్రమే కాస్ట్ కౌచింగ్ పేరిట మహిళా ఆర్టిస్టుల పట్ల అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని, అటువంటి వారిపై పోలీసు కేసులు నమోదుచెయ్యాలని కొందరు సినీ పెద్దల దృష్టికి తీసుకువస్తే తాము పరిష్కరిస్తామని కొందరు, కాస్ట్ కౌచింగ్ ఇష్టం లేకపోతే సినీ అవకాశాలను వదులుకోవచ్చుగా, ఎందుకు మీడియాకు ఎక్కి రాద్ధ్దాంతం చెయ్యడం అంటూ పలువాదనలను వినిపిస్తున్నారు. ఇన్నాళ్ళు నివురుగప్పిన నిప్పులా ఉన్న ఈ కాస్ట్ కౌచింగ్ అనే దుర్మార్గం తెలుగు సినీ పరిశ్రమలో ఉందని దానిని అరికట్టడానికి సినీ పరిశ్రమలోని పెద్దలు ఎటువంటి చర్యలు తీసుకోలేదని స్పష్టంగా తెలిసిపోతుంది. ఈ ఉదంతాలను సినీ పరిశ్రమలోని పెద్దలు ఎవరు కూడా పెద్ద విషయంగా పరిగణించకపోవడం విచారకరం.రంగురంగుల ప్రపంచం అంటే అందరికీ మోజే. తమ నటనను తెరపై చూసుకోవాలని కోటి ఆశలతో హైదరాబాద్ ఫిల్మ్ నగర్ వైపు పరుగెడుతున్నారు. సమాజంలో చాలా మంది భవిష్యత్తులో ఒక డాక్టరుగానో, ఇంజనీరుగానో లేక మరే ఇతర రంగాలలోనో స్థిరపడాలని, దానిలో నిలబడాలని కోరుకుంటూ ఉంటారు. అలాగే సినీ ప్రపంచం వైపు చూసే ఎందరో వందలాది మంది యువకులు, యువతులు తమ కుటుంబాల కట్టుబాట్లను, ఇష్టాఇష్టాలను కాదని తమ భవిష్యత్తును నిర్ణయించుకుంటున్నారు. అలా తమ ఇళ్ళను వదిలి సినిమాలలో చాన్సులకోసం వారు పడే పాట్లు వర్ణణాతీతం.కడుపునిండా భోజనం లేకుండా, కంటినిండా నిద్రలేకుండా, చిన్న చిన్న అద్దె గదులలో ఉంటూ సినిమాలలో చాన్సుల కోసం ఎవరు పడితే వారిని కలుస్తూ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. సినిమాలలో హీరోల వేకన్సీ కేవలం పెద్ద పెద్ద హీరోల కుటుంబాలకే పరిమితమైంది అన్న విషయం అందరికి తెలిసిందే. అరకొర మందే స్వయంశక్తితో హీరోలుగా మనగలుగుతున్నారు. బడా నిర్మాతలు సైతం పేద, మధ్యతరగతి వారికి హీరో స్థాయి అవకాశాలను ఇవ్వటం లేదు. సమాజంలో మహిళలపై జరిగే జరుగుతున్న వివక్ష, అఘాయిత్యాలు ఒకవైపయితే సినీ పరిశ్రమలో జరిగే వివక్ష, అఘాయిత్యాలు మరో వైపు అన్నది పచ్చి నిజం. మహిళల అందం, చందం, వారికి వేసే దుస్తుల విషయంలో కూడా పెట్టుబడులుగా భావించే పరిశ్రమలో ఇలాంటి అఘాయిత్ యాలను ఇంకా కఠినంగా ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

యువకులు తమ జీవితాలను ఫణంగా పెట్టి చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తూ తమకు వచ్చే రోజూవారీ జీతాలపై కూడా దోపిడీకి గురవుతున్నారు. సినీ అవకాశాలకోసం వచ్చే మహిళల జీవితాలపై జరిగే దోపిడి మరింత నిర్లజ్జగా కొనసాగుతున్నది. 

Related Posts