YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు దేశీయం

విమానంలో పెళ్లి.. సిబ్బందిపై సస్పెన్షన్

 విమానంలో పెళ్లి.. సిబ్బందిపై సస్పెన్షన్

చెన్నై, మే 24, 
తమిళనాడుకు చెందిన ఓ జంట తమ పెళ్లిని వినూత్నంగా జరుపుకుని వార్తల్లోకి ఎక్కింది. అయితే, కరోనా నిబంధనలను గాలికొదిలేయడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మధురైకి చెందిన ఓ జంట విమానంలో వివాహం జరుపుకుంది. జీవితంలో ఒక్కసారి జరిగే ఈ వేడుకను కలకాలం గుర్తిండిపోయేలా ఖర్చుకు వెనుకాడకుండా ఏకంగా ఓ విమానాన్నే అద్దెకు తీసుకున్నారు. బంధుమిత్రులతో కలిసి స్పైస్ జెట్‌కు చెందిన విమానంలో మధురై నుంచి తూత్తుకూడికి వెళ్లారు. విమానం గాల్లో ఉండగానే వివాహ తంతు జరిపించారు. కరోనా మహమ్మారి ఉద్ధృతంగా ఉన్న సమయంలో జరిగిన ఈ పెళ్లిలో ఎక్కడా కోవిడ్ మార్గదర్శకాలు పాటించలేదు. తమిళనాడులో అమలవుతున్న నిబంధనల ప్రకారం.. వివాహ వేడుకకు అతిథులు 50 మందికి మించరాదు. కానీ, ఏకంగా విమానంలో 161 మంది ఎక్కడంతో క్రిక్కిరిసిపోయింది. అలాగే, వధూవరులతోపాటు అతిథులు కూడా మాస్క్ ధరించలేదు. మాస్కుల్లేకుండానే మాంగల్యధారణ జరిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా నిబంధనలు గాలికొదిలేసి వివాహ వేడుకలేంటని అసంతృప్తి వ్యక్తం చేసిన డీజసీఏ.. దీనిపై విచారణకు ఆదేశించింది. పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలంటూ స్పైస్ జెట్, ఎయిర్ పోర్ట్ వర్గాలను ఆదేశించింది. స్పైస్ జెట్ సంస్థ ఆ విమానంలోని సిబ్బందిని విధుల నుంచి తప్పించింది. నిబంధనలు పాటించకుండా విమానం ఎక్కిన పెళ్లి బృందంపై ఫిర్యాదు చేయాలంటూ స్పైస్ జెట్‌ను డీజీసీఏ ఆదేశించింది.‘‘స్పైస్‌జెట్ చార్టెడ్ విమానాన్ని మదురై నుంచి ఆదివారం బుక్ చేశారు.. గాల్లోకి విమానం ఎగిరిన తర్వాత వివాహం జరిగిన విషయం విమానాశ్రయ అధికారులకు తెలియదు’’ అని మదురై ఎయిర్‌ఫోర్ట్ డైరెక్టర్ సెంథిల్ వల్లవన్ అన్నారు. ఈ ఘటనపై స్పందించిన స్పైస్ జెట్ సంస్థ.. ఓ ట్రావెల్ ఏజెంట్ ద్వారా మే 23న విమానం బుక్ చేశారని, వివాహం తర్వాత సరదగా తిరిగి రావడానికి చెప్పారంది.‘‘కోవిడ్ మార్గదర్శకాల గురించి క్లయింట్‌కు స్పష్టంగా వివరించాం.. ప్రయాణ సమయంలో ఏ కార్యక్రమానికి అనుమతిలేదని చెప్పాం... విమానాశ్రయం, ప్రయాణించే విమానంలో కోవిడ్ మార్గదర్శకాల ప్రకారం భౌతిక దూరం, భద్రతా నిబంధనల గురించి ఏజెంట్, ప్రయాణీకులకు లిఖితపూర్వకంగా, మౌఖికంగా వివరించాం’’ అని అన్నారు. పదే పదే కోవిడ్ నిబంధనలు గురించి చెప్పినా పాటించని ప్రయాణికులపై చర్యలు తీసుకుంటామని తెలిపింది. ప్రస్తుతం తమిళనాడులో కరోనా కట్టడికి మే 31 వరకు లాక్‌డౌన్ అమల్లో ఉంది.

Related Posts